BigTV English

Viswam Movie Review : విశ్వం మూవీ రివ్యూ…

Viswam Movie Review : విశ్వం మూవీ రివ్యూ…

చిత్రం : విశ్వం
విడుదల తేది : 11 అక్టోబర్ 2024
నటీనటులు : గోపీచంద్, కావ్య థాపర్,జిష్షు సేన్‌గుప్తా, వీటీవీ గణేష్,
దర్శకుడు : శ్రీను వైట్ల
నిర్మాత : T. G. విశ్వ ప్రసాద్
సంగీత దర్శకుడు : చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : K. V. గుహన్
బ్యానర్ : చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ


Viswam Movie Rating – 2/5 

వరుస ప్లాపుల్లో ఉన్న హీరో, ఫేడౌట్ దశకి దగ్గర్లో ఉన్న డైరెక్టర్, ఫామ్లో లేని హీరోయిన్, దుకాణం సర్దేసే స్థితిలో ఉన్న నిర్మాత.. ఇలాంటి కాంబినేషన్లో వచ్చిన సినిమాగా ‘విశ్వం’ ని చెప్పుకోవచ్చు. ఏమాత్రం అంచనాలు లేకుండా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :


కథ :
పాకిస్థాన్ కి చెందిన ఓ టెర్రరిస్ట్(జిస్ సేన్ గుప్తా) ఇండియాకి వచ్చి రెడిక్యులేషన్ పేరుతో ఇక్కడ యువతని టెర్రరిస్ట్ గ్రూప్లో జాయిన్ అయ్యేలా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇందుకు మినిస్టర్(సుమన్) తమ్ముడు(సునీల్) అతనికి సాయం చేస్తాడు. ఈ విషయం మినిస్టర్ కి తెలిసిపోవడంతో.. ఆ టెర్రరిస్ట్ తో కలిసి తన అన్న అయిన మినిస్టర్ ని చంపేస్తాడు అతని తమ్ముడు. ఈ మర్డర్ ని దర్శన అనే పాప చేసేస్తుంది. దీంతో ఆ పాపని చంపాలి అనుకుంటారు. అయితే ఆ పాపని గోపి(గోపీచంద్) కాపాడుతూ ఉంటాడు. మరోపక్క సమైరా(కావ్య థాఫర్) ఇటలీ వెళ్ళినప్పుడు గోపిని కలుస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ కొన్ని కారణాల వల్ల .. ఇద్దరూ అక్కడ విడిపోతారు. తర్వాత ఊహించని విధంగా సమైరా కుటుంబానికి దగ్గరవుతాడు గోపి. ఇంతకీ దర్శన అనే పాప ఎవరు? అతనికి గోపికి సంబంధం ఏంటి? గోపి గతమేంటి? మధ్యలో విశ్వం ఎవరు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :
దర్శకుడు శ్రీను వైట్ల దాదాపు 6 ఏళ్ళ తర్వాత చేసిన సినిమా ఇది.వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న అతనికి గోపీచంద్ వంటి హీరో దొరకడం కూడా ఓ సువర్ణ అవకాశం అనే చెప్పాలి. సినిమా ఏమాత్రం బాగున్నా.. మాస్ ఆడియన్స్ పాస్ మార్కులు వేసేస్తారు. ‘విశ్వం’ విషయంలో శ్రీను వైట్ల కాన్ఫిడెన్స్ అదే. ఫస్ట్ హాఫ్ బాగానే తీశాడు. కొత్తగా లేకపోయినా సునీల్, 30 ఇయర్స్ పృథ్వీల కామెడీతో టైం పాస్ అయిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అయినా.. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ని తలపిస్తుంది. క్లైమాక్స్ లో ఇంకా ల్యాగ్ ఉంది. దర్శకుడిగా శ్రీను వైట్ల..ఈ 6 ఏళ్లలో అప్డేట్ అయ్యింది ఏమీ లేదు. ‘విశ్వం’ ఫస్ట్ హాఫ్ మొత్తం ‘దుబాయ్ శీను’ టెంప్లేట్లో ఉంటుంది. సెకండాఫ్ ట్రైన్ ఎపిసోడ్ ‘వెంకీ’ టెంప్లేట్, ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ‘బాద్ షా’ ఇలా అతని సినిమాల్లోని సీన్లు అడుగడుగునా గుర్తు చేస్తూనే ఉంటాయి. గుహన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. గుంగురు గుంగురు అనే పాట మాస్ ఆడియన్స్ కి ఎక్కే ఛాన్స్ ఉంది. యాక్షన్ డోస్ చాలా ఎక్కువైంది. ముఖ్యంగా వయొలెన్స్ చాలా ఎక్కువగా ఉంది. క్లైమాక్స్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాత పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే.

నటీనటుల విషయానికి వస్తే.. గోపీచంద్ ఎప్పటిలానే తన మార్క్ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. యాక్షన్ ఎపిసోడ్స్ అతని ఇమేజ్ కి తగ్గట్టు ఉన్నాయి. కావ్య థాఫర్ పాటలకి ముందుగా వచ్చి కనిపిస్తుంది. గ్లామర్ తో కొంతవరకు మెప్పించింది. నరేష్, ప్రగతి, 30 ఇయర్స్ పృథ్వీ..ల కామెడీ ఓకే. వెన్నెల కిషోర్ కూడా తన మార్క్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ‘కిక్’ శ్యామ్, ప్రియా వడ్లమాని, ముఖేష్ ఋషి వంటి వాళ్ళు తమ పాత్రలకి న్యాయం చేశారు. ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కానీ వాళ్ళని దర్శకుడు పెద్దగా వాడుకోలేదు. సునీల్, జిస్సు సేన్ గుప్తా..లు కూడా ఒకటి, రెండు రోజులు కాల్షీట్లు మాత్రమే ఇచ్చినట్టు ఉన్నారు. హడావిడి హడావిడిగా వాళ్ళ పాత్రలు ముగుస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
కామెడీ
రెండు పాటలు
గోపీచంద్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్
క్లైమాక్స్
రొటీన్ స్టోరీ

మొత్తంగా ‘విశ్వం’ కొత్తగా ఏమీ ఉండదు. కాకపోతే శ్రీను వైట్ల గత చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తో పోలిస్తే బెటర్. మాస్ సెంటర్ ఆడియన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ ‘విశ్వం’ లో కొన్ని ఉన్నాయి. ‘దసరా’ హాలిడేస్ ని కొంతవరకు క్యాష్ చేసుకోవడానికి అవి పనికొస్తాయి.

Viswam Movie Rating – 2/5 

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×