Vizag Steel plant: కష్టాల కడలిలో ఈదుతున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వరుస అగ్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్ఏంఎస్-2 మిషన్ విభాగంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి.
మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు సిబ్బంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని ప్లాంట్ వర్గాలు చెప్పాయి. మిషన్-2లో ఆయిల్ లీకై మంటలు చెలరేగాయి. నిప్పురవ్వలు ఆయిల్‌పై పడడంతో కేబుల్ మిషనరీ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
ఎస్ఏంఎస్ 2 మిషన్ లో ఎగసిపడుతున్న మంటలు
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది pic.twitter.com/uMYPJb2pZQ
— BIG TV Breaking News (@bigtvtelugu) May 23, 2025