BigTV English

Murali Nayak: బుల్లెట్ల వర్షంతో 14 మందిని.. ఖతం చేసిన తెలుగు వీరుడు!

Murali Nayak: బుల్లెట్ల వర్షంతో 14 మందిని.. ఖతం చేసిన తెలుగు వీరుడు!

Murali Nayak: గుంపుగా ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డ సమయం అది. మన భారత సైన్యం వారిని మట్టుబెడుతూ అడ్డుకుంటోంది. అంతలోనే మన సైనికుడు తుపాకీ చేతబట్టి ముందుకు వచ్చాడు. తన చేతిలో ఉన్న తుపాకీని చేతబట్టి జైహింద్ అంటూ ఫైరింగ్ మొదలు పెట్టాడు. తన తుపాకీ నుండి బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఒకటి కాదు రెండు కాదు దేశ రక్షణే ప్రాణం అనుకున్నాడు. అలాగే ముందుకు సాగుతూ అడుగులు వేశాడు. ఉగ్రమూకలు వెనుకడుగు వేసిన సమయం అది.


ధైర్యసాహసాలతో తుపాకీ పట్టిన మన సైనికుడు ఏకంగా 14 మంది ఉగ్ర మూకలను మట్టుబెట్టాడు. దేశమా నీ కోసం నా ప్రాణాలు అర్పిస్తానంటూ ముందుకు సాగాడు. అంతలోనే పొంచి ఉన్న ఉగ్రమూకలో ఒకడు తుపాకీ ఎక్కు పెట్టి, మన వీర సైనికుడిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. చివరి బుల్లెట్ ను ఆ ఉగ్రవాదిపై ఎక్కుపెట్టి మరీ, మన భారత సైనికుడు అమరుడయ్యాడు. ఆ వీర సైనికుడు ఎవరో కాదు ఏపీకి చెందిన వీర జవాన్ మురళీ నాయక్.

దేశమాతకి తన ప్రాణాలను అర్పించిన వీరుడి పేరు మురళీ నాయక్. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండా గ్రామం. భారత సైన్యంలో పని చేస్తున్న మురళీ నాయక్ ప్రస్తుతం కాశ్మీర్‌లో విధుల్లో ఉన్నారు. మహారాష్ట్ర నాసిక్‌లో ట్రైనింగ్ పూర్తి చేసిన అనంతరం, ఉత్తర భారతదేశంలోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన సేవలు అందిస్తున్నారు.


తాజాగా జరిగిన ఉగ్రదాడిలో మురళీ నాయక్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. దాడి జరిగిన సమయంలో శత్రువులతో ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనుకాడకుండా ముందుకు సాగారు. తుపాకీ ఎక్కిపెట్టి వరుసగా 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అయితే చివరికి 15వ ఉగ్రవాది కాల్పుల్లో మురళీ నాయక్ అమరుడయ్యాడు. ఈ వార్త విని కల్లితండా గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. కానీ వీరుడిగా దేశం కోసం చేసిన త్యాగం పట్ల గర్వంగా ఉంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆయన వీరత్వాన్ని స్మరించుకుంటూ కన్నీటి నివాళులర్పించారు.

భారత భద్రతా బలగాల్లో సేవలందించిన మురళీ నాయక్‌కు దేశమంతటా నివాళులు అర్పిస్తున్నారు. దేశం కోసం ప్రాణం అర్పించిన తెలుగు బిడ్డపై ప్రతి భారతీయుడూ గర్వపడే సమయం ఇది. మురళీ నాయక్ చేసిన త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 14 మందిని చంపి మురళీ నాయక్ అమరుడైనట్లు తనకు మిలటరీ సమాచారం ఇచ్చిందని అతని తండ్రి, కుటుంబ సభ్యులు మీడియాతో తెలిపారు. తన బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరుడైనందుకు సగర్వంగా ఉందని వారు తెలిపారు.

Also Read: S-400 Sudarshan Chakra: S -400.. మన దేశ భరోసా..! తిరుగులేని వజ్రాయుధం.. దీని ప్రత్యేకత ఏంటంటే..

  1. అయితే ఉగ్రమూకలకు ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందిన మురళీ నాయక్ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని యావత్ భారతావని కోరుకుంటూ నివాళి అర్పిస్తోంది. అమరుడా.. నీ త్యాగం ఊరికే పోదు అంటూ కల్లితండా గ్రామ యువకులు నినదించారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ సీఎం జగన్, పలువురు మురళీ నాయక్ త్యాగాన్ని కొనియాడి, సంతాపం వ్యక్తం చేశారు. అయితే కుటుంబ సభ్యులు మీడియాతో 14 మందిని చంపినట్లు తెలిపినప్పటికీ, ఆర్మీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కానీ మురళీ నాయక్ త్యాగం మాత్రం మరువలేనిది.. పోరాటం స్పూర్తిదాయక మైనది.

మురళీ నాయక్ విగ్రహం ఏర్పాటు
ధర్మం కోసం జరుగుతున్న పోరాటంలో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. వీర జవాన్ తల్లిదండ్రులు విషాదంలో ఉన్నా తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తాను కూడా సొంతంగా రూ.5 లక్షలు అందజేసినట్లు మంత్రి సవిత తెలిపారు. మురళీ నాయక్ ధైర్య సాహసాలు భవిష్యత్తు తరాలకు తెలియాలనే లక్ష్యంతో గోరంట్ల మండలం ప్రధాన సర్కిల్ లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. మురళీ నాయక్ మృతదేహం శనివారం బెంగుళూరు నుంచి స్వగ్రామానికి వస్తుందని, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి సవిత తెలిపారు. అంతకుముందు మురళీనాయక్ చిత్ర పటానికి మంత్రి సవిత నివాళులర్పించారు.

Related News

TTD Warning: టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై కేసుల నమోదు.. కటకటాలే!

Visakhapatnam: వైజాగ్‌కు టీసీఎస్ వచ్చేసింది.. 2000 మందితో త్వరలోనే..?

Pawan Kalyan Gifts: టీచర్స్ డే.. అదిరిపోయే కానుక ఇచ్చిన పవన్.. అదేమిటంటే?

Deepam-2 Scheme: ఏపీ గిరిజనులకు బంపర్ గిఫ్ట్.. చిన్న సిలిండర్‌కు గుడ్‌బై.. పెద్ద సిలిండర్‌తో ఫుల్ లాభం!

Disney World AP: అమెరికా నుంచి డైరెక్ట్ షిఫ్ట్.. డిస్నీ వరల్డ్ కోసం రెడీ అవుతున్న.. ఏపీలోని ఆ నగరం!

Vizag Updates: విశాఖకు స్పెషల్ గెస్ట్ వచ్చేశారు.. అలా వెళ్లి ఇలా చూసి రండి!

Big Stories

×