BigTV English

OTT Movie : పెళ్ళాలను మార్చుకునే దిక్కుమాలిన ఫాంటసీ… ఇంత ఓపెన్ గా అలాంటి సీన్లేంది భయ్యా ?

OTT Movie : పెళ్ళాలను మార్చుకునే దిక్కుమాలిన ఫాంటసీ… ఇంత ఓపెన్ గా అలాంటి సీన్లేంది భయ్యా ?

OTT Movie : రొమాంటిక్ సినిమాలంటే చెవి కోసుకునే అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. వీళ్ళ కోసం ఒక అదిరిపోయే సినిమా ఓటీటీలో హీట్ పెంచుతోంది. ఓపెన్ రిలేషన్‌షిప్ తో మొదలయ్యే ఈ సినిమా ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఇందులో రెండు జంటలు భార్యలను మార్చుకుని లైఫ్ ని గందరగోళంలో పడేసుకుంటారు. ఇది ఒక రొమాంటిక్ మూడ్ నుంచి థ్రిల్లర్ గా మారుతుంది. అలాంటి సీన్స్ ఎక్కువే ఉన్నందువల్ల, దీనిని ఒంటరిగా చూడటమే మంచిది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


స్టోరీలోకి వెళ్తే 

బెక్కా, రాన్ ల వైవాహిక జీవితం కష్టాల్లో ఉంటుంది. రాన్ ఒక చిన్న కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తుంటాడు. ఒక గాయం కారణంగా ఆ పని కూడా చేయలేకపోతుంటాడు. బెక్కా నర్సుగా డబుల్ షిఫ్ట్‌లు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. వాళ్లు ఒక బిడ్డ కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ఫెర్టిలిటీ డ్రగ్స్‌తో కూడా ప్రెగ్నెన్సీ ని సాధించలేకపోతున్నారు. ఈ సమయంలో మాక్స్, మిండీ అనే కాలేజ్ స్నేహితులు వీళ్ళను కలుస్తారు. తమ వివాహం కష్టాల్లో ఉన్నప్పుడు ఓపెన్ మ్యారేజ్‌తో సమస్యలను పరిష్కరించుకున్నామని చెప్తారు. బెక్కా, రాన్ ఈ ఆలోచనను మొదట వింతగా భావిస్తారు. కానీ తమ శృం*గార జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మాక్స్, మిండీతో ఓపెన్ రిలేషన్‌షిప్‌కి అంగీకరిస్తారు. అయితే ఒక కండీషన్ తో దీనిని మొదలుపెడతారు. ఎవరైనా ఒకరు ఆపాలనుకుంటే, ప్రశ్నలు లేకుండా ఈ రిలేషన్‌షిప్‌ ఆపేయచ్చు.

ఈ ఓపెన్ రిలేషన్‌షిప్ మొదలైన తర్వాత, బెక్కా, రాన్ ఒక కొత్త పాషన్‌ని కనుగొంటారు. కానీ జీలసీ, సీక్రెట్స్, అబద్ధాలు ఈ సంబంధంలో త్వరలోనే సమస్యలను తెస్తాయి. ఇక మరిన్ని సమస్యలు వస్తాయని ఈ రిలేషన్ ని స్టాప్ చేస్తారు. అయితే ఒక సారి రాన్ ఒక స్వింగర్స్ క్లబ్‌కి ఒంటరిగా వెళ్తాడు. ఆ సమయంలో మాక్స్‌తో బెక్కా రహస్యంగా కలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రాన్ ఆమె మాక్స్ తో గర్భవతి అవుతుందనే సందేహం వస్తుంది. బెక్కా ఆసుపత్రిలో పాటర్నిటీ టెస్ట్ చేస్తే, బిడ్డ రాన్‌దేనని తేలుతుంది. ఇంతలో మిండీ రాన్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. ఇది బెక్కాకి అనుమానం కలిగిస్తుంది. ఈ కథ ఒక హత్యతో థ్రిల్లింగ్ క్లైమాక్స్‌తో ముగుస్తుంది. ఈ హత్య ఎవరు ఎవర్ని చేస్తారు ? వీళ్ళ రిలేషన్స్ ఎలా ఉంటాయి ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.


ఎందులో ఉందంటే

‘Open Marriage’ 2017లో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ మూవీ. శామ్ ఇర్విన్ దర్శకత్వంలో టిల్కీ జోన్స్ (రాన్), నిక్కీ లీ (బెక్కా), కెల్లీ డౌడిల్ (మిండీ), జాసన్ టోబియాస్ (మాక్స్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2017 జనవరి 14న లైఫ్‌టైమ్‌లో ప్రీమియర్ అయింది. 1 గంట 27 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.0/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, టూబీలో ఇంగ్లీష్ ఆడియోతో, హిందీ, తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

Read Also : పెళ్ళైన డాక్టర్ తో మోడల్ మెంటల్ పని… జీవితాన్నే మార్చేసే లింగరీ యాడ్… క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా

Related News

OTT Movie: పెళ్లికాని అర్చన పాట్లు.. కడుపుబ్బా నవ్వించే ఈ మలయాళం మూవీ అస్సలు మిస్ కావద్దు!

OTT Movie : గ్యాంగ్స్టర్ తో సీక్రెట్ డీల్… రివేంజ్ కోసం ఇంతకు దిగజారాలా ? ట్విస్టులే ట్విస్టులున్న పంజాబీ యాక్షన్ థ్రిల్లర్

OTT Movie: అసలే అజంతా గుహలు.. పక్కనే అందమైన అమ్మాయి, రొమాన్స్ ప్రియులకు పండగలాంటి సినిమా ఇది

OTT Movie : చేతబడి చేసి చావుకు దగ్గరయ్యే అమ్మాయి… మాస్క్ చుట్టే మిస్టరీ అంతా… 7 రోజుల్లో ఆ పని చేయకపోతే ఫ్యామిలీ ఫసక్

OTT Movie : టీచర్ కు పాఠాలు నేర్పించే 17 ఏళ్ల కుర్రాడు… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ ఎమోషనల్ డ్రామా

Big Stories

×