Nagavamsi on Vijay Deverakonda : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు దశా దిశా రెండింటిని మారుస్తాయి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఎంతటి ప్రభావాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పై చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత సందీప్ రెడ్డి 100 దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమా అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఒక మామూలు కథను ఇలా కూడా చెప్పొచ్చు అని చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఆ సినిమాను డిజైన్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అక్కడితో సందీప్ రెడ్డి వంగ కూడా ఒక బ్రాండ్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే సందీప్ రెడ్డివంగా సినిమాలు మాత్రమే అలా ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పాలి. సందీప్ రెడ్డి రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్ గా కొంతమందితో మాట్లాడుతాడు. కానీ సందీప్ రెడ్డి ని అటాక్ చేసి మాట్లాడితే వాళ్లకు అదే స్థాయిలో ఆన్సర్ ఇవ్వడం సందీప్ రెడ్డి వంగకు అలవాటు.
ఆటిట్యూడ్ విజయ్ దేవరకొండ
పెళ్లిచూపులు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాకు ముందు మాట్లాడిన కొన్ని స్పీచెస్ చాలా వైరల్ గా మారిపోయాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి ఈవెంట్ లో మాట్లాడింది అప్పట్లో బాగా వైరల్ అయింది. ఇంత యాటిట్యూడ్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అంత ఈజీ కాదు అని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా విజయ్ మాట్లాడిన తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. ఇక విజయ్ దేవరకొండ విపరీతమైన ట్రోలింగ్ కు గురి అయ్యాడు. కొన్నిసార్లు ట్రోలింగ్ కూడా తన సొంత మార్కెటింగ్ కు ఉపయోగించుకునేవాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను సితార నాగ వంశీ నిర్మించారు.
సాఫ్ట్ స్పోకెన్ పర్సన్
చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అనుకున్నట్లుగానే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాత నాగ వంశీ కూడా గౌతమ్ తిన్ననూరి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇంత ఆటిట్యూడ్ ఉన్న హీరోతో ఏం పని చేస్తాం అని అనుకుని వెళ్లి విజయ్ దేవరకొండను కలిశారు. కానీ ఒక్కసారి విజయ్ దేవరకొండను కలిసిన తర్వాత వాళ్ళ ఆలోచనలన్నీ మారిపోయాయట. చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ వెరీ హంబుల్. మైక్ పట్టుకొని స్టేజ్ పై మాట్లాడిన విజయ్ వేరు మామూలు విజయ వేరు అని అర్థం వచ్చేటట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసి బర్త్డే విషెస్ తెలియజేశాడు నిర్మాత నాగ వంశీ. అంతేకాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తప్పుగా అర్థం చేసుకున్న ఒక వ్యక్తిగా విజయ్ దేవరకొండ పర్సనాలిటీని చెప్పుకొచ్చాడు. ఇప్పుడిప్పుడే ఈ విషయం కూడా చాలామందికి అర్థం అవుతుంది. ఇక కింగ్డమ్ సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.