Ghaati: కొన్ని సినిమాల కు చివరి నిమిషంలో అడ్డంకులు వస్తుంటాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఘాటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాని అనుష్క బయటకు కనిపించకుండా ఫోన్ కాల్స్, ట్విట్టర్ స్పేస్ తో ప్రమోషన్ చేసిన విధానం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు చివరి నిమిషంలో సినిమా టీంకు చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈగల్ ఈ సినిమా మీద అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
ఘాటి సినిమాకు సంబంధించిన కథ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో జరుగుతుంది. చాలా బరువులు వేసుకొని కొండలెక్కుతూ కొన్ని సరుకులను ఎలా సప్లై చేశారు అనేదాన్ని ఈ సినిమాలో చూపించాడు క్రిష్ జాగర్లమూడి. అయితే ఈ సినిమాలో గంజాయి సప్లై సంబంధించిన సీన్స్ ఉన్నాయి. దీనిపైన ఇప్పుడు ఈగల్ టీం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
ఒకపక్క మాదకద్రవ్యాలను నివారించాలి అంటూ ప్రభుత్వం పలు సూచనలు ఇస్తుంది. ఈ తరుణంలో గంజాయి కి సంబంధించిన కొన్ని సీన్స్ సినిమాలో ఉండడం అనేది కరెక్ట్ కాదు అని ఈగల్ టీం అభ్యంతరం. దీనిపై చర్యలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తుంది. దీనిపై చిత్ర యూనిట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.
Also Read: 2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా?