BigTV English

Women Assaulted: రైల్వే స్టేషన్‌ లో దారుణం, మహిళను తుపాకీతో బెదిరించి.. గదిలోకి లాక్కెళ్లి…

Women Assaulted: రైల్వే స్టేషన్‌ లో దారుణం, మహిళను తుపాకీతో బెదిరించి.. గదిలోకి లాక్కెళ్లి…

Bihar Crime:

ప్రభుత్వాలు ఎంత కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై దారుణాలు ఆగడం లేదు. తాజాగా రైల్వే స్టేషన్ లో రైలు కోసం వేచి చూస్తున్న మహిళను ఇద్దరు వ్యక్తులు  తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బీహార్ లో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

మంగళవారం రాత్రి బీహార్‌ లోని పాట్నా రైల్వే స్టేషన్ దగ్గర ఒక మహిళ రాత్రి 11.30 గంటల సమయంలో రైలు  కోసం వేచి చూస్తోంది. ఆ సమయంలో మోటార్‌ సైకిల్‌ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్న మహిళను తుపాకీ చూపించి బెదిరించారు. స్టేషన్ సమీపంలోని ఒక గదికి బలవంతంగా తీసుకెళ్లి, అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు.  సంఘటన జరిగిన కొద్దిసేపటికే ఆమె సమీపంలోని పోలీసు పెట్రోలింగ్ బృందానికి సమాచారం ఇచ్చింది. “ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి రైల్వే స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లి,  అత్యాచారం చేశారని పెట్రోలింగ్ బృందానికి సమాచారం ఇచ్చింది” అని పాట్నా రూరల్ ఎస్పీ విక్రమ్ సిహాగ్ వెల్లడించారు. మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్

మహిళ  ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, వెంటనే దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతికతను  ఉపయోగించి నేరం జరిగిన ప్రదేశాన్ని గుర్తించారు. నిందితులను స్థానిక నివాసితులు సోను కుమార్ యాదవ్, అలియాస్ సోను సనాత, నిరంజన్‌ గా దర్యాప్తు బృందం గుర్తించింది. “దర్యాప్తు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు.  కానీ, వారిని అక్కడికక్కడే పట్టుకున్నారు” అని ఎస్పీ సిహాగ్ వెల్లడించారు.  సోను కుమార్‌ కు ఇప్పటికే నేర చరిత్ర ఉందని ఎస్పీ చెప్పారు. “ఫతుహా, బార్, ఖుస్రుపూర్, జక్కన్‌ పూర్ పోలీస్ స్టేషన్‌ లలో గతంలో నమోదైన ఎనిమిది కేసుల్లో అతడి పేరు ఉంది. వీటిలో దోపిడీ, ఆయుధాలతో దాడి, నేరపూరిత కుట్రకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి. ఈ గ్యాంగ్‌ రేప్ కేసుతో, అతడిపై మొత్తం కేసుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది” అన్నారు.


భూమి బ్రోకరేజ్ ముసుగులో దోపిడీలు

పోలీసుల దర్యాప్తులో, నిందితులు ఇటీవల భూమి బ్రోకరేజ్‌ లో పాల్గొనడం ప్రారంభించారని తేలింది. ఆ నెట్‌ వర్క్ ద్వారా దోపిడీకి పాల్పడినట్లు కూడా వెల్లడైంది. “భూ లావాదేవీల ముసుగులో వారు డబ్బు అక్రమంగా వసూలు చేసి ఉండవచ్చని మాకు తెలుస్తోంది. ఎవరైనా వారికి డబ్బు చెల్లించమని బలవంతం చేసి ఉంటే, మేము వారి నుంచి కూడా ఫిర్యాదులు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. నిందితులను తదుపరి విచారణ కోసం రిమాండ్‌ కు తరలించాం” అని  ఎస్పీ వివరించారు.

Read Also: ఆ టైమ్ లో రైల్లో రీల్స్ చూస్తున్నారా? ఇత్తడైపోద్ది జాగ్రత్త!

Related News

Railway Guidelines: ఆ టైమ్ లో రైల్లో రీల్స్ చూస్తున్నారా? ఇత్తడైపోద్ది జాగ్రత్త!

India Guinness Records: గిన్నిస్‌లో ఇండియా బ్లాస్ట్.. మెట్రో అదరగొట్టింది.. ఇదేం డిజైన్ బాబోయ్!

Meteorite: ఆకాశం నుంచి పడ్డ బంగారు ఉల్క.. అసలు విషయం తెలిసి అంతా షాక్!

Local Trains: ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. 238 కొత్త రైళ్లకు సూపర్ ఫీచర్.. జర్నీ చాలా స్మార్ట్ గురూ!

Ramagundam Station: నిన్నటి వరకు ఆ స్టేషన్ జీరో.. ఇప్పుడు హీరో.. మీ సమీపంలోనే ఓ లుక్కేయండి!

Big Stories

×