BigTV English

Deepam-2 Scheme: ఏపీ గిరిజనులకు బంపర్ గిఫ్ట్.. చిన్న సిలిండర్‌కు గుడ్‌బై.. పెద్ద సిలిండర్‌తో ఫుల్ లాభం!

Deepam-2 Scheme: ఏపీ గిరిజనులకు బంపర్ గిఫ్ట్.. చిన్న సిలిండర్‌కు గుడ్‌బై.. పెద్ద సిలిండర్‌తో ఫుల్ లాభం!

Deepam-2 Scheme: ఏపీ ప్రభుత్వం గిరిజనులకు పెద్ద ఊరట ఇచ్చింది. కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన కుటుంబాలకు ఇకపై చిన్న సిలిండర్ల బదులు పెద్ద గ్యాస్ సిలిండర్లు అందించబోతుంది. ఇప్పటివరకు 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ వాడుతున్న కుటుంబాలకు, ఇప్పుడు 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్లు అందించాలని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాదు, ఈ సిలిండర్లను సంవత్సరానికి 3 సార్లు ఉచితంగా రీఫిల్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. దీంతో మొత్తం 23,912 మంది లబ్ధిదారులు దీపం – 2 పథకం కింద లాభం పొందబోతున్నారు.


ఈ నిర్ణయం వెనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ ఉంది. ఇటీవల ఆయన గిరిజన ప్రాంతాల పర్యటన సందర్భంగా, స్థానికులు చిన్న సిలిండర్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పెద్ద సిలిండర్లు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో, వంటచెరుకు వాడకం తగ్గించేందుకు, ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు, పర్యావరణానికి మిత్రమైన ఇంధనాన్ని అందించేందుకు పెద్ద సిలిండర్లు అవసరమని ప్రజలు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ ప్రతిపాదనను పాజిటివ్‌గా తీసుకున్న సీఎం, వెంటనే పౌర సరఫరాల శాఖను ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

దీని ఆధారంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సొంతంగా ముందుకొచ్చి ప్రతిపాదనలు తీసుకెళ్లారు. ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీపం–2 పథకం కింద చిన్న సిలిండర్లను పెద్ద సిలిండర్లుగా మార్చే నిర్ణయానికి ఆమోదం లభించింది. దీని వల్ల గతంలో 14.2 కిలోల సిలిండర్లకు సమానంగా సబ్సిడీ రాని సమస్య కూడా పరిష్కారమైంది. ఇక నుంచి చిన్న సిలిండర్లతో ఇబ్బందులు చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది.


Also Read: Disney World AP: అమెరికా నుంచి డైరెక్ట్ షిఫ్ట్.. డిస్నీ వరల్డ్ కోసం రెడీ అవుతున్న.. ఏపీలోని ఆ నగరం!

ప్రస్తుతం ఏఎస్‌ఆర్‌, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, నంద్యాల, ఎన్టీఆర్‌, పార్వతీపురం మన్యం, ప్రకాశం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్‌ఆర్‌ కడప, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు 16 జిల్లాల్లో గిరిజన కుటుంబాలు ఈ పథకం లబ్ధి పొందనున్నాయి. దీని వల్ల వందల గ్రామాల్లో ఉన్న గిరిజన గృహిణులకు కిచెన్‌లో ఊరట కలిగే అవకాశం ఉంది.

పథక చరిత్ర

దీపం పథకం అసలు 1999లో గ్రామీణ ప్రాంతాల్లో, 2000లో పట్టణాల్లో ప్రవేశ పెట్టారు. దీని లక్ష్యం బీపీఎల్ మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం, వంటచెరుకుపై ఆధారపడకుండా చేయడం. అంతేకాదు, వంట కోసం అడవులు నరికివేయడాన్ని తగ్గించడం, ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడం ప్రధాన ఉద్దేశ్యం. 2017లో ప్రభుత్వం 100 శాతం ఎల్పీజీ ఆధారిత రాష్ట్రం చేయాలని నిర్ణయించుకుంది. కిరోసిన్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి, 1.57 లక్షల గిరిజన కుటుంబాలకు కూడా గ్యాస్ సౌకర్యం కల్పించింది. అదే సమయంలో, కొండ ప్రాంతాల రవాణా ఇబ్బందుల కారణంగా 5 కిలోల సిలిండర్లు ప్రవేశపెట్టారు.

కొత్త నిర్ణయం ప్రయోజనాలు

ఇప్పుడు చిన్న సిలిండర్లను పెద్దవిగా మార్చడం వల్ల ఒక కుటుంబం ఒకే సారి ఎక్కువ కాలం వాడుకునే అవకాశం దొరుకుతుంది. ఇంతకు ముందు చిన్న సిలిండర్లు తరచుగా రీఫిల్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు పెద్ద సిలిండర్ వాడటం వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. ముఖ్యంగా, కొండ ప్రాంతాల నుంచి సిలిండర్లను మోసుకెళ్లడం కష్టమవుతుండేది. పెద్ద సిలిండర్ వల్ల ఆ సమస్య తగ్గిపోతుంది.

ఆర్థిక భారం.. ప్రభుత్వ సిద్ధత

ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 5.54 కోట్లు అదనపు భారం పడనుంది. అయినా గిరిజన కుటుంబాల కోసం ఇది చిన్న విషయం కాదని, వంట ఇంధనంలో వారికి భరోసా కల్పించడమే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే HPCL, IOCL, BPCL కంపెనీలతో పాటు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కొత్త నిర్ణయం గిరిజన ప్రాంతాల మహిళలకు ఒక పెద్ద ఊరట. వంట చెరుకు మబ్బుల మధ్య గడిపిన రోజులకు గుడ్‌బై చెప్పి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అందించడానికి ఇది మరో ముందడుగు. ఒకవైపు ఆరోగ్యం, మరోవైపు పర్యావరణం.. రెండూ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గిరిజన కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపనుంది.

Related News

TTD Warning: టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై కేసుల నమోదు.. కటకటాలే!

Visakhapatnam: వైజాగ్‌కు టీసీఎస్ వచ్చేసింది.. 2000 మందితో త్వరలోనే..?

Pawan Kalyan Gifts: టీచర్స్ డే.. అదిరిపోయే కానుక ఇచ్చిన పవన్.. అదేమిటంటే?

Disney World AP: అమెరికా నుంచి డైరెక్ట్ షిఫ్ట్.. డిస్నీ వరల్డ్ కోసం రెడీ అవుతున్న.. ఏపీలోని ఆ నగరం!

Vizag Updates: విశాఖకు స్పెషల్ గెస్ట్ వచ్చేశారు.. అలా వెళ్లి ఇలా చూసి రండి!

Big Stories

×