Visakhapatnam: విశాఖపట్నంలో రుషికొండ సమీప ఐటీ హిల్స్ పై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన డెలివరీ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు అడుగులు పడుతున్నాయి. హిల్ -3లోని మిలీనియం టవర్స్ లో దాదాపు 2,000 మంది ఉద్యోగులతో, 80 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఏపీ ప్రభుత్వం నుండి వచ్చిన విశ్వయసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అన్ని మౌలిక సదుపాయాలు, అంతర్గత డిజైన్ పనులు ఈ నెలలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం టీసీఎస్‌కు రుషికొండ హిల్ నంబర్ 3లోని మిలీనియం టవర్స్ ఏ, బీలలో కార్యాలయ స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుతం.. ఇక్కడ 75% పనులు పూర్తయినట్లు సమాచారం. ఈ స్థలం కోసం నెలకు చదరపు అడుగుకు 29 రూపాయల చొప్పున అద్దె నిర్ణయించారు. ఇది నెలకు సుమారు రూ. 60లక్షల 40వేల 120 లుగా ఉంటుంది. టీసీఎస్ ఇప్పటికే మిలీనియం టవర్స్ భవనంపై తమ సైన్ బోర్డ్‌ను కూడా ఏర్పాటు చేసింది. రాబోయే కొన్ని రోజుల్లో శాశ్వత క్యాంపస్‌కు మారాలని యోచనలో టీసీఎస్ ఉంది.
ఇక్కడ సెంటర్ కు సంబంధించిన పనులు సెప్టెంబర్ నాలుగో వారంలో ప్రారంభం కావాలని ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. అందుకోసం సెప్టెంబర్ 20 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని గడువు కూడా విధించింది. అలాగే, టీసీఎస్‌కు కేటాయించిన 21.16 ఎకరాల విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ (VSEZ) భూమిని నాన్- సెజ్ గా డీనోటిఫై చేయమని కేంద్ర ప్రభుత్వ అనుమతితో వీఎస్‌ఈజడ్‌కు లేఖ రాసింది. వీఎస్‌ఈజడ్ అధికారి ఈ దరఖాస్తుపై స్పందిస్తున్నట్లు ధృవీకరించారు.
ALSO READ: Dharmavaram News: రాష్ట్రంలో దారుణ హత్య.. వేట కొడవళ్లతో నరికి నరికి చంపేశారు, వీడియో వైరల్
2025 జనవరి 3న ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ విశాఖపట్నంలో టీసీఎస్ డెలివరీ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ (ఐడీపీ) 4.0, 2024-29 కింద 2.08 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని రాయితీ అద్దెపై కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐఐసీ)ని ప్రభుత్వం కోరింది. 2025 ఏప్రిల్ 21న ఐటీ హిల్ నంబర్ 3లో 21.16 ఎకరాల భూమిని 1,370 కోట్ల రూపాయల పెట్టుబడితో శాశ్వత క్యాంపస్ నిర్మాణం కోసం టీసీఎస్‌కు చదరపు అడుగుకు 0.99 రూపాయల చొప్పున కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.
ALSO JOB IN APMSRB: ఏపీలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. లక్షల్లో వేతనం, దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు
టీసీఎస్‌ను కంపెనీగా ప్రభుత్వం సమర్థిస్తోంది. రాష్ట్ర ఐటీ రంగం 2029 నాటికి ఐదు లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం తన వ్యూహాత్మక స్థానం, గుడ్ కనెక్టివిటీ అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాల కారణంగా రాష్ట్ర ఐటీ హబ్‌గా ఎదిగింది.