BigTV English

S-400 Sudarshan Chakra: S -400.. మన దేశ భరోసా..! తిరుగులేని వజ్రాయుధం.. దీని ప్రత్యేకత ఏంటంటే..

S-400 Sudarshan Chakra: S -400.. మన దేశ భరోసా..! తిరుగులేని వజ్రాయుధం.. దీని ప్రత్యేకత ఏంటంటే..

S-400 Sudarshan Chakra: యూకెన్ రన్ బట్ యూ కాంట్ ఎస్కేప్ ఫ్రం S400 ఇది.. ఈ డిఫెన్స్ సిస్టమ్ పై ఉండే కామెంట్. అంతే కాదు మీరు భారత్ లోకి ప్రవేశించాలంటే మొదట నన్ను టచ్ చేయాలంటోంది.. ఎస్ 400. అక్షరాలా.. ఎగ్జాట్ గా అదే చేసి చూపించిందీ వ్యవస్థ. ఇంతకీ ఏమిటి దీని ప్రత్యేకత. ఇది సాధించిన విజయాలు ఎలాంటివి? ఆ డీటైల్స్ ఏంటి? హ్యావే లుక్..


భారత అమ్ముల పొదిలో
సుదర్శన చక్రం S 400
పాక్ దాడులతో ఢీ అంటే ఢీ
గాల్లో ఉండగానే రివర్స్ కౌంటర్

గాల్లో ఉండగానే రివర్స్ కౌంటర్


రవూఫ్ మృతికి పాక్ ప్రతీకార దాడి

భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో జైషే ఉగ్ర సంస్థ.. ఆపరేషనల్ చీఫ్‌ అబ్దుల్ రవూఫ్ అజర్ మృతి చెందడంతో.. తీవ్ర ఆందోళనకు గురైంది పాక్ ఆర్మీ. ఆ ఫ్రస్టేషన్లో.. భారత్ పై ప్రతీకార దాడికి దిగాలన్న నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఒకే సారి 15 ప్రధాన నగరాలపై క్షిపణి ప్రయోగాలు చేసింది. ముంబై , ఢిల్లీ, జైపూర్, అంబాలా, శ్రీనగర్, జోధ్ పూర్ వంటి కీలక సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది.

సహా పలు కీలక సైనిక స్థావరాలపై గురి

అయితే ఆధునిక క్షిపణులు భారత గగన తలాన్ని తాకే ముందు భారత్ తన రక్షణ వ్యవస్థను అత్యంత సమర్ధవంతంగా ప్రయోగించింది. రష్యన్ మేడ్ ఎస్ 400 ట్రయింఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని భారత్ లో సుదర్శన్ గా పిలుస్తారు. ఈ వ్యవస్థ ద్వారా టార్గెట్ లాకాన్ చేసింది భారత్. ఏ ఒక్క పాక్ మిస్సైల్ కూడా టార్గెట్ రీచ్ అవకుండా విజయవంతంగా అడ్డుకుంది ఎస్ 400. ఈ చర్య ద్వారా.. ఏ భారత విమానాశ్రయం కానీ, సైనిక స్థావరం కానీ చెక్కు చెదరలేదు.

ఏ ఒక్క మిస్సైల్ టార్గెట్ రీచ్ అవకుండా అడ్డగింత

పాకిస్థాన్ ఈ దాడి కోసం చైనా ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ, టార్గెట్ నెట్వర్క్ ప్లానింగ్ ద్వారా నిర్వహించింది. అయితే భారత్ వాడిన ఎస్ 400 ముందు చైనా టెక్నాలజీ వెలవెలపోయింది. పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణుల్లో 90 శాతం వరకూ తైవాన్, చైనా ఉత్పత్తులే. భారత గగన తలాన్ని చేరే ముందు ఇవన్నీ ధ్వంసమయ్యాయి. దటీజ్ ఎస్ 400.

పాక్ మిస్సైళ్లను గుర్తించిన మన రాడార్ సిస్టమ్

భారత వైమానిక దళం.. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్, దాని అనుబంధ రాడార్ల ద్వారా పని చేస్తుంది. పాకిస్థాన్ నుంచి గాలిలోకి ఎగిరిన వీటిని గుర్తించిందీ రాడార్ వ్యవస్థ. వెంటనే ఈ సమాచారాన్ని వివిధ వైమానిక రక్షణ విభాగాలకు పంపించింది. ఇవి కేటాయించిన లక్ష్యాల ఆధారంగా వచ్చే కదలికలపై ఫోకస్ చేశాయి. వెంటనే వాటిని రివర్స్ అటాక్ చేసి లక్ష్యాలు చేరుకోకుండా అడ్డుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పటి నుంచి ఉత్తర పశ్చిమ రాడార్ స్టేషన్లను అప్రమత్తం చేసింది భారత రక్షణ వ్యవస్థ. అందులో భాగంగా పాకిస్థాన్ గగన తలం నుంచి ఎగిరే ప్రతి అంశంపై దృష్టి సారించింది మన రాడార్ సిస్టమ్.

లాహోర్ లోని వైమానిక రక్షణ వ్యవస్థను నిర్వీర్యం

భారత్ సైతం పాకిస్థాన్ లాగానే కామికేజ్ డ్రోన్లను ప్రయోగించింది. లాహోర్ లోని వైమానిక రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. భారత్ నుంచి జరిగిన దాడులు సఫలీకృతం అయ్యాయి. గుజ్రన్ వాలా, చక్వాల్, రావల్పిండి, బహావల్పూర్, మియానో, చోర్, కరాచీ దగ్గర్లో దాడులు జరిగినట్టు పేర్కొంది పాక్ ఆర్మీ. లాహోర్ దాడిలో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడినట్టు కూడా ప్రకటించింది.

S 400 ప్రపంచంలోనే అత్యంత అధునాతన దీర్ఘ శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ

S 400 ప్రపంచంలోనే అత్యంత అధునాతన దీర్ఘ శ్రేణి వాయు రక్షణ వ్యవస్థల్లో ఒకటి. ఇందులో మూడు భాగాలుంటాయి. మిస్సైల్ లాంచర్, పవర్ఫుల్ రాడార్ సిస్టమ్, కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు.. వేగంగా కదిలే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ఢీకొట్టగలదు. దీని పూర్తి సామర్ధ్యం కారణంగా నాటో దీన్నొక ముప్పుగా భావిస్తుంది.

ఎస్ 400 దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఢీ కొట్టగలదు

ఎస్ 400 దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఢీ కొట్టగలదు. దీని రాడార్ 600 కిలోమీటర్ల లక్ష్యాలను కూడా ట్రాక్ చేయగలదు. అంతటి శక్తిమంతమైన వ్యవస్థ దీని సొంతం. 2018 అక్టోబర్ లో.. భారత్ ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి సంబంధించి మొత్తం ఐదు యూనిట్లను కొనడానికి 5 బిలియన్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. అందులో భాగంగా భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ ఎస్ 400 లు ప్రస్తుతం భారత అమ్ముల పొదిలో సుదర్శన చక్రాల్లా పని చేస్తున్నాయి.

ఆకాశానికి రక్షణ కవచం.. ఎస్ ఫోర్ హండ్రెడ్

ఆకాశానికి రక్షణ కవచం.. ఎస్ ఫోర్ హండ్రెడ్. అంతే కాదు ఇది ప్రపంచ అత్యుత్తమం. ఆ మాటకొస్తే గేమ్ ఛేంజర్ కూడా. ఇలాంటి ఎన్నో విశేషణాల కలబోత ఎస్ 400. దీన్ని హిందూ పురాణాల ప్రకారం చెబితే ఒక బ్రహ్మాస్త్రం. దీని కొనుగోలు నుంచి దిగుమతి వరకూ అంతా వివాదాసపదం.. చర్చనీయాంశం. నాటో అయితే వద్దు బాబోయ్ అంటుంది. ఇక పాక్ గుండెల్లో ఒణుకు పుట్టింది. అంతగా ఇందులో ఏముంది?

ఉపరితలం నుంచి గగనానికి
ఒకే సారి 80 లక్ష్యాల చేధన

ఎస్ 400 ట్రయింఫ్ ప్రపంచ అత్యుత్తమం. ఉపరితల నుంచి గగనతల అత్యుత్తమ క్షిపణి వ్యవస్థల్లో ఇది టాప్ మోస్ట్. సుమారు 250 మైళ్ల పరిధి కలిగి ఉంటుంది. ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్.. ఒకే సారి భారీ లక్ష్యాలను చేధించగలదు. అధిక మొత్తంలో వాటిని చేధించి నిర్వీర్యం చేయగలదు. ప్రస్తుతం పాకిస్థాన్ 15 లక్ష్యాలను మన మీదకు వదలగా.. వాటిని అవలీలగా తిప్పి కొట్టిన గేమ్ ఛేంజర్ ఎస్ ఫోర్ హండ్రెడ్.

ఆ మాట నిజం చేసి చూపించింది ఎస్ ఫోర్ హండ్రెడ్.

తక్కువ ఎత్తు ఎగిరే డ్రోన్ల నుంచి వివిధ ఎత్తులలో ఎగురుతున్న విమానాలు, దీర్ఘ శ్రేణి క్షిపణుల వరకూ వైమానిక లక్ష్యాలను ఇట్టే చేధించగలదని చెబుతుంది రష్యా. ఆ మాట నిజం చేసి చూపించింది ఎస్ ఫోర్ హండ్రెడ్.

కీలకంగా పని చేసేది ఎంగేజ్ మెంట్ రాడార్

ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుందంటే.. మొదట లాంగ్ రేంజ్ రాడార్ ద్వారా ట్రాక్ చేస్తుంది. లక్ష్యాలను అంచనా వేసి.. కమాండ్ వాహనానికి సమాచారం పంపుతుంది. వచ్చిన డాటా ఆధారంగా.. నిర్దేశిత స్థానంలో ఉంచిన వాహనానికి ఇన్ఫాం చేస్తుంది. దీంతో అది ఉపరితలం నుంచి గగన తలానికి క్షిపణులు విడుదల చేస్తుంది. ఇందులో అతి కీలకంగా పని చేసేది ఎంగేజ్ మెంట్ రాడార్. ఇది క్షిపణులను లక్ష్యాల వైపు పయనించడానికి గొప్పగా సాయపడుతుంది.

ఈ డీల్ విలువ 35 వేల కోట్లకు పైమాట

2018 లో పుతిన్ రష్యా వచ్చినపుడు.. భారత్ మొత్తం ఐదు యూనిట్ల కోసం ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ 35 వేల కోట్లకు పైమాట. ఉక్రెయిన్ తో యుద్ధంలో ఉన్న రష్యా ఈ డెలివరీ చేయగలదా? అన్న అనుమానాలు వ్యక్తం చేసింది భారత్. కొంత జాప్యం జరిగే అవకాశముందని భావించింది. అయితే వీటి సరఫరా విషయంలో తమపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది.. రష్యా. అంతే కాదు పర్ఫెక్ట్ డెలివరీ చేసింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గలేదు

అప్పట్లో ఈ ఒప్పందంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా సరే భారత్ లెక్క ఏయలేదు. తమ మాట వినకుండా ఈ అగ్రిమెంట్ చేసుకుంటే.. తాము భారత్ పై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది నాటి ట్రంప్ సర్కార్. అయినా సరే భారత్ రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గలేదు.

భారత్ రష్యాకు అంతటి ఆప్త మిత్ర దేశం

భారత్ రష్యాకు అంతటి ఆప్త మిత్ర దేశం. ఈ రెండు దేశాల మధ్య ఆయుధ అనుబంధం ఈ నాటిది కాదు. భారత్ అమ్ముల పొదిలో ఉన్న 70 శాతం ఆయుధాలు రష్యాకు చెందినవే. తానెంత ఆపత్కాలంలో ఉన్నా సరే రష్యా చేసిన ఈ డెలివరీ.. ప్రస్తుతం భారత్ కి ఎంతగానో ఉపయోగ పడుతోంది.

మొత్తంగా బుల్లెట్ ప్రూఫ్ టు అవర్ స్కై గానూ అభివర్ణించవచ్చు

యుద్ధ రంగ నిపుణుల మాటలను అనుసరించి చెబితే.. ఇది అత్యంత బలీయమైనది. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో సహా దేన్నయినా సరే ఇట్టే పసిగట్టగలదు. తన మిస్సైల్ సిస్టమ్ ని అలెర్ట్ చేయగలదు. ఒక రకంగా చెబితే భారత సరిహద్దుల్లో కట్టిన రక్షణ గోడగా చెప్పాలి. అంతే కాదు.. ఆకాశానికి తొడిగిన రక్షణ కవచంగా చెప్పొచ్చు. మొత్తంగా బుల్లెట్ ప్రూఫ్ టు అవర్ స్కై గానూ అభివర్ణించవచ్చు. ఒక వేళ పాక్ అణ్వాయుధాలను వదిలినా సరే వాటిని వెంటనే పసిగట్టి నిర్వీర్యం చేయగల సామర్ధ్యం ఎస్ ఫోర్ హండ్రెడ్ సొంతం.. అంటారు వార్ ఫేర్ ఎక్స్ పర్ట్స్.

2026 నాటికి మరో రెండు అందుబాటులోకి

చైనా పాకిస్థాన్ ఆగడాలను దృష్టిలో పెట్టుకుని భారత్ ఎస్ 400 క్షిపణి వ్యవస్థను సరిహద్దుల్లో మొహరించింది. ప్రతి S-400 స్క్వాడ్రన్‌లో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒక్కొక్కటి ఆరు లాంచర్లు, అడ్వాన్స్డ్ రాడార్ తో కూడిన ఓ కంట్రోల్ సెంట్రర్ ఇందులో అమర్చబడి ఉంటుంది. ఒక్కో బ్యాటరీ 128 క్షిపణులను సపోర్ట్ చేస్తాయి. భారతదేశం రష్యా నుంచి 5 స్క్వాడ్రన్లను కొనుగోలు చేయగా. వాటిలో మూడు ఇప్పటికే పనిచేస్తున్నాయి. 2026 నాటికి మరో రెండు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

ఈ గగనతల రక్షణ వ్యవస్థను నాటో ముమ్మాటికీ తిరస్కరిస్తుంది

400 కి.మీ దూరంలో ఉన్న స్టీల్త్ ఎయిర్‌క్రాఫ్ట్, ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్ లేదా బాలిస్టిక్ క్షిపణులతో సహా గాల్లో నుంచి దాడి చేసి ఎలాంటి ప్రమాదాన్నయినా ఇది గుర్తించగలదు. ఆ తర్వాత వాటిని ఆకాశంలోనే ధ్వంసం చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాల్లో సుదర్శన్ S-400 శత్రు క్షిపణులను 80 శాతం వరకూ పేల్చి తన పరాక్రమాన్ని ప్రదర్శించింది. రష్యా తయారు చేసిన ఈ గగనతల రక్షణ వ్యవస్థను నాటో ముమ్మాటికీ తిరస్కరిస్తుంది. ఇది నాటో సభ్య దేశాల రక్షణ వ్యవస్థలకు పూర్తి భిన్నమైనది. భద్రతా పరమైన ముప్పుగా భావిస్తుంటాయీ దేశాలు. కారణమేంటంటే దీనిపై సైబర్ దాడులు జరుగుతాయన్న ఆందోళన కొద్దీ నాటో దేశాలు ఎస్ 400 ని వద్దంటాయి. ఇందుకు ప్రత్యామ్నయంగా తమ సొంత రక్షణ వ్యవస్థలను కానీ, అమెరికా నుంచి కొనుగోలు చేసిన వ్యవస్థలను కానీ వాడుతుంటాయి.

వ్యవస్థపై పాక్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది

అయితే ఎస్ 400 లను కొనుగోలు చేసిన తొలి దేశం.. చైనా. 2014లోనే చైనా ఈ యూనిట్లను ఆర్డర్ చేసింది. అప్పట్లో దీని అంచనా వ్యయం 3 బిలియన్ డాలర్లు. 2018లోనే దీని డెలివరీ తీసుకుంది చైనా. మనం అప్పట్లో కొనుగోలు చేసిన ఈ గగన తల వ్యవస్థపై పాక్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు దాని తాలూకూ ప్రభావం చవి చూస్తోంది. చైనాను నమ్మి తాము నిండా మునిగామన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×