E-Paper
Advertisement

ఎంజీ To టాటా.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ఎంజీ To టాటా.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Best Electric Cars Under  Rs.10 Lakh: భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, పర్యావరణ హితమైన ప్రయాణం లాంటి కారణాలతో చాలామంది EVల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు బడ్జెట్‌ లో మంచి రేంజ్, అత్యాధునిక ఫీచర్లు, భద్రత కలిగిన కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మూడు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.

1.ఎంజీ కామెట్ EV  

సిటీలో రోజువారీ ప్రయాణాల కోసం చిన్న సైజు కారు కావాలనుకునే వారికి ఈ మోడల్ బెస్ట్. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈజీగా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. చిన్న పార్కింగ్ స్థలాల్లో కూడా ఇబ్బంది లేకుండా నిలపొచ్చు. ఈ కారు ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.99 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. డ్యూయల్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి  డిజైన్ తో ఆకట్టుకుంటుంది. సిటీ ప్రయాణాల కోసం ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

2.టాటా టియాగో EV  

Advertisement

బడ్జెట్‌లో అన్ని అవసరాలను తీర్చే ఎలక్ట్రిక్ కారు కావాలంటే ఈ కారును సెలెక్ట్ చేసుకోవచ్చు. కుటుంబ వినియోగానికి అనువైన హ్యాచ్‌ బ్యాక్‌ గా మంచి పేరు సంపాదించింది. నగరంలోనే కాకుండా అప్పుడప్పుడు హైవే ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు ఉంటుంది. బ్యాటరీ వేరియంట్‌ను బట్టి ఒకసారి ఛార్జ్ చేస్తే 250 నుంచి 315 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. 4 స్టార్ సేఫ్టీ రేటింగ్, DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, సౌకర్యవంతమైన డ్రైవింగ్  అవకాశం కలిగిస్తుంది.

3.టాటా పంచ్ EV  

SUV లుక్, ఎత్తైన సీటింగ్ పొజిషన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కావాలనుకునే వారికి ఈ కారు నచ్చుతుంది. ముఖ్యంగా స్మార్ట్ వేరియంట్ రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో లభించడం విశేషం. ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలు. చిన్న బ్యాటరీ ప్యాక్‌ తో గరిష్టంగా 315 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. విశాలమైన క్యాబిన్, ఐదుగురు సౌకర్యంగా కూర్చునే సీటింగ్, అత్యాధునిక ఇంటీరియర్, రోడ్డుపై SUV తరహా అనుభూతి ఈ కారు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఏ కారు ఎంచుకోవాలి?

Advertisement

సిటీ ప్రయాణాలకే ఎక్కువగా ఉపయోగిస్తే ఎంజీ కామెట్, అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలంటే టాటా టియాగో, SUV స్టైల్, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, విశాలమైన క్యాబిన్ కావాలంటే టాటా పంచ్ ఈవీని కొనుగోలు చేయండం మంచిది.

Read Also: టాటా సియెర్రా EV కొనాలా? వద్దా? ముందుగా ఈ ప్లస్‌లు.. మైనస్‌లు తెలుసుకోండి!

Related News

పెట్రోల్ నుంచి EVకి మారాలనుకుంటున్నారా? అదిరిపోయే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

E20 పెట్రోల్‌ మైలేజ్ లొల్లి.. గడ్కరీ షాకింగ్ కామెంట్స్!

టాటా సియెర్రా EV కొనాలా? వద్దా? ముందుగా ఈ ప్లస్‌లు.. మైనస్‌లు తెలుసుకోండి!

ట్రయంఫ్ రాకెట్ 3కి స్టన్నింగ్ కలర్స్.. లుక్ చూస్తే అదిరిపోవాల్సిందే!

కవాసకి బైక్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 56 వేలు తగ్గింపు!

గూగుల్ మ్యాప్స్‌ లో త్రీడీ నావిగేషన్.. ఇక దారి తప్పే ఛాన్స్ లేదు!

లైట్ వెయిట్.. హై సేఫ్టీ.. క్రేజీ ఇగ్నైట్ కార్బన్ హెల్మెట్లు వచ్చేశాయ్!

Big Stories

Advertisement
×