Smaran Ravichandran: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఉన్న ప్రత్యేకత గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2024 లో ఎవ్వరూ ఊహించనివిధంగా భారీ స్కోర్ చేశారు. దీంతో ఆ సీజన్ లో టైటిల్ సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఫైనల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. అదే అంచనాలతో 2025 సీజన్ లో బరిలోకి దిగి తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. కానీ ఆ తరువాత పేలవ ప్రదర్శన కనబరిచింది. చివరి రెండు మ్యాచ్ ల్లో విజయంతో ముగించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ సీజన్ లో 7వ స్థానంలో నిలిచింది. ప్లే ఆప్స్ కి చేరుకోకపోవడం గమనార్హం.
Also Read : Varun-Shruti : టీమిండియా క్రికెటర్ కు దగ్గర అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్?
ఆ ఆటగాళ్లు SRH కి దూరం
భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన కనబరచడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది ఆటగాళ్లను వదిలించుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో ముఖ్యంగా ఇషాన్ కిషన్ పేరు ఫస్ట్ వినిపించడం విశేషం. అలాగే సిక్సర్ల వీరుడు క్లాసెన్ ని కూడా సన్ రైజర్స్ వదిలేయనున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపై మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే SRH జట్టులో మరో ఆణిముత్యం దొరికినట్టు తెలుస్తోంది. అతను ఎవ్వరో కాదు. స్మరన్ రవిచంద్రన్. అతను మహారాజా లీగ్ అద్భుతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా 22 ఏళ్ల స్మరన్ రవిచంద్రన్ మహారాజా ట్రోఫీలో రెండో మ్యాచ్ లో 22 బంతుల్లో 52, 5వ మ్యాచ్ లో 39 బంతుల్లో 52, 6వ మ్యాచ్ లో 30 బంతుల్లో 53, 8వ మ్యాచ్ లో 48 బంతుల్లో 84, 9వ మ్యాచ్ లో 52 బంతుల్లో 89 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో అతను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
బౌలింగ్ లో పేలవ ప్రదర్శన..
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ముఖ్యంగా ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ఆటగాళ్లతో టీ-20లీగ్లో డేంజరస్ జట్టుగా ఉంది. వీరితో పాటు అభిషేక్ శర్మ, నితిశ్ కుమార్ రెడ్డి వంటి వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. గతంలో రజినీకాంత్ పలు సూచనలు చేయడంతో 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్ గా నిలిచింది. తాజాగా రజినీకాంత్ మంచి ప్లేయర్లను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాడు. గతంలో రజీనీ సార్ చెప్పినట్టు చెప్పిన కావ్య మారన్.. ఇప్పుడు కూడా అలాగే చేయనున్నట్టు తెలుస్తోంది. కొంత మంది ఆటగాళ్లను తొలగించి మరికొంత మంది నమ్మకస్తులైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. రజీనీ సార్ చెప్పినట్టుగా చేస్తే ఈ సారి కూడా మంచి ఫలితాలను రాబడుతుందని కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ పేర్కొన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో కాస్త గాడి తప్పిందనే చెప్పాలి.