AP Govt: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. సంక్షేమంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల సొంతింటి కలను నిజం చేస్తూ పట్టణాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూపాయికే అనుమతులు లభించనున్నాయి.
ఏపీలో పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో 50 చదరపు మీటర్లలో ఇల్లు కట్టుకునేవారికి రూపాయికే అనుమతులు లభించనున్నాయి. భవనాల నిర్మాణంలో సెట్ బ్యాక్‌లకు సంబంధించి వెసులుబాట్లు ఇచ్చింది.
9 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నారు. పై వివరాలను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.
పట్టణ ప్రజలు ఇల్లు నిర్మించుకునేవారికి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఒక అంతస్తు భవనాలకు మాత్రమే వర్తిస్తుంది. చిన్న స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని అనుకునేవారికి ప్రత్యేకంగా శుభవార్త అని చెప్పాలి. 100 చదరపు మీటర్ల భూమిలో ఇల్లు కట్టాలంటే కనీసం 2 మీటర్ల వెడల్పు రోడ్డు ఉండాలి. 100 చదరపు మీటర్ల స్థలంలో 3.6 మీటర్ల వెడల్పు రోడ్డు కచ్చితంగా ఉండాలి.
ALSO READ: బెంగుళూరు ఎందుకు, విశాఖలోనే భారీగా ఐటీ జాబ్స్
స్థలం తక్కువగా ఉన్నా ఇంటి నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక భవనాలకు నాలుగు వైపులా సెట్‌బ్యాక్ విషయంలో కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. 100 చదరపు మీటర్ల లోపు అయితే ఎలాంటి సెట్ బ్యాక్ అవసరం లేదు. 100 నుంచి 500 చదరపు మీటర్ల భూమిలో ఇంటి ముందు ఒక మీటరు నుంచి 3 మీటర్లు ఉండాలి.
మూడు వైపులా 0.75 మీటర్ల నుంచి 2 మీటర్లు ఖాళీ ప్రాంతం ఉండాలి. అదే 500 నుంచి 2,500 చదరపు మీటర్ల స్థలంలో అయితే 3 మీటర్ల నుంచి 5.5 మీటర్ల వరకు ఖాళీ స్థలం ఉండాల్సిందే. మిగిలిన మూడు వైపులకు పాత నిబంధనలే వర్తిస్తాయి. 2,500 చదరపు మీటర్లు దాటిన ఇంటి నిర్మాణానికి ఈ నిబంధన వర్తించనుందని ప్రభుత్వం మాట.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇంటి నిర్మాణాల నిబంధనలు ఉల్లంఘించే అవకాశం ఉండదని భావిస్తోంది. దీనివల్ల ఎక్కువ స్థలంలో నిర్మాణం చేసుకోవచ్చు. 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ భూమిలో ఇంటి నిర్మాణం చేపడితే సెల్లార్ పార్కింగ్‌కు అనుమతిస్తారు. సెట్‌బ్యాక్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది.
అంతేకాదు ప్రతి భవనంలో తడి, పొడి వ్యర్థాల నిర్వహణ తప్పనిసరి చేసింది. రోడ్డు విస్తరణ సమయంలో స్థలం కోల్పోతే టీడీఆర్ బాండ్లు ఇచ్చేలోపు కొంత స్థలంలో నిర్మాణాలు చేసుకోవచ్చు. అయితే చిన్న ప్లాట్లకు రోడ్డు విషయంలో కాస్త సడలింపులు ఇచ్చింది. సెక్యూరిటీ పోస్ట్, బిల్డింగ్, సెట్‌బ్యాక్ ప్రాంతంలో ఎస్టీపీ, ఈటీపీ ఏర్పాటుకు అనుమతి ఉండనుంది.
3 మీటర్ల ఎత్తు దాటిన భవనాలు బాల్కనీలు 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించుకునే సదపాయం ఇచ్చింది. వీటితోపాటు అన్ని రకాల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హోటల్స్, గవర్నమెంట్ కాంప్లెక్స్‌లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇల్లు కట్టుకోవడం పేదలకు మరింత సులభం కానుంది.