Confirm Ticket Booking Tricks: పండుగ సీజన్ వచ్చేసింది. గణేష్ చవితి, దసరా, దీపావళి, ఛత్ పూజ లాంటి పండుగలు వరుసగా రాబోతున్నాయి. రైలు టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ధృవీకరించబడిన రైలు టికెట్ పొందడం అంత సులభం కాదు. కన్ఫార్మ్ టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ సీటు కన్ఫార్మ్ కావాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని టిప్స్ పాటించడం వల్ల కన్ఫార్మ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది.
రైలులో ప్రయాణించే చాలా మందికి IRCTC టికెట్ బుకింగ్‌కు సంబంధించిన ట్రిక్స్ గురించి తెలియదు. వాటి గురించి తెలుసుకుంటే ఈజీగా టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ఇందు కోసం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కొన్ని చిన్న మార్పులు చేయాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
IRCTC టిప్స్ తో కన్ఫార్మ్ టికెట్ పొందే అవకాశం
దీపావళి, ఛత్ పూజ సహా ఇతర సందర్భాల్లో కన్ఫార్మ్ టికెట్ కావాలనుకుంటే, బుకింగ్ సమయంలో కొన్ని ఫీచర్లు ఉపయోగించాలి. మీరు తొలుత ప్రత్యామ్నాయ రైళ్ల ఎంపికను ఎంచుకోవాలి. ఒకే రోజు అదే రూట్ లో నడుస్తున్న ఇతర రైళ్లలో ఖాళీ సీట్లు కూడా కనిపిస్తాయి. మీరు ఒకే రైలుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
అటు టికెట్ బుకింగ్ సమయంలో మీరు ఆటో అప్ గ్రేడ్ ఎంపికను సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు దీనిని ఆన్ చేయాలి. అలా చేయడం వల్ల హై క్లాస్ లో సీటు ఖాళీగా ఉంటే, అదనంగా ఛార్జీ పే చేయకుండానే దానిలో సీటు పొందుతారు.
ఒకవేళ మీరు ఎక్కాలనుకున్న స్టేషన్ లో రద్దీ ఎక్కువగా ఉంటే, పెద్ద నగరాల్లోని స్టేషన్ల మాదిరిగా ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తే, అప్పుడు మీరు సమీపంలోని చిన్న స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసుకోవడం మంచిది.
Read Also: వినాయక చవితి ప్రత్యేకం.. అందుబాటులోకి 380 ప్రత్యేక రైళ్లు!
ఒకవేళ మీరు టికెట్లు బుక్ చేసుకున్నా కన్ఫార్మ్ కాకపోతే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తత్కాల్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ బుక్ చేసుకునేటప్పుడు తక్కువ సమయంలోనే వెయిటింగ్ లిస్ట్ లోకి వెళుతుంది. అందుకే సమయం వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే ప్రయాణీకుల వివరాలను పొందుపరుచుకోవాలి. ఐఆర్సీటీసీ వ్యాలెట్ ద్వారా మనీ పే చేయాలి. హైస్పీడ్ ఇంటర్నెట్ వాడాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల ఈజీగా కన్ఫార్మ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది. సో, ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా కన్ఫార్మ్ టికెట్ కావాలంటే, ఈ టిప్స్ పాటించండి. టికెట్లు బుక్ చేసుకోండి!
Read Also: 60 డేస్ అడ్వాన్స్ బుకింగ్ రూల్.. పండుగ వెళ్లాలంటే టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి?