OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో హారర్ జానర్ ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఈ సినిమాలు ఇచ్చే థ్రిల్ కూడా మరో లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఇద్దరు వ్యక్తులు, మత ప్రచారం చేస్తూ ఒక వింత వ్యక్తి చేతిలో చిక్కుకుంటారు. అక్కడ ఒక భయంకరమైన మానసిక హింస జరుగుతుంది. ఈ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘హెరెటిక్’ (Heretic) అమెరికన్ సైకలాజికల్ హారర్ సినిమా. బ్రయాన్ వుడ్స్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో హ్యూ గ్రాంట్ (మిస్టర్ రీడ్), సోఫీ థాచర్ (సిస్టర్ బర్న్స్), క్లోయి ఈస్ట్ (సిస్టర్ పాక్స్టన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2024 నవంబర్ 8న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సినిమా 7.0/10 రేటింగ్ పొందింది.
స్టోరీలోకి వెళ్తే
సిస్టర్ బర్న్స్, సిస్టర్ పాక్స్టన్ అనే ఇద్దరు చర్చ్ మిషనరీ అమ్మాయిలు, చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ తరపున ఒక చిన్న పట్టణంలో మత ప్రచారం చేస్తుంటారు. ఈ క్రమంలో వీళ్ళు మిస్టర్ రీడ్ అనే వ్యక్తి ఇంటికి వెళతారు. ఎందుకంటే అతను చర్చిపై ఆసక్తి చూపినట్లు తెలుస్తుంది. రీడ్ వారిని స్నేహపూర్వకంగా లోపలి ఆహ్వానిస్తాడు. తన భార్య బ్లూబెర్రీ జ్యుస్ తయారు చేస్తోందని చెప్పి మాటలు కలుపుతాడు. కానీ అక్కడ ఫోన్ సిగ్నల్ ఉండవు. తలుపు కూడా లాక్ అయి ఉంటుంది. ఇంతలో రీడ్ వారితో మతం గురించి ఒక చర్చను ప్రారంభిస్తాడు. అన్ని మతాలు ఒకే మూలం నుండి వచ్చాయని, నిజమైన మతం అనేది నియంతృత్వం అని వాదిస్తాడు.
అతను అక్కడ రెండు తలుపులను చూపిస్తాడు. ఒకటి విశ్వాసం ఉన్నవారికి, మరొకటి విశ్వాసం లేనివారికి. కానీ రెండు దారులు భయంకరంగా ఉండే సెల్లార్‌కు దారితీస్తాయి.సెల్లార్‌లో రీడ్ ఒక మహిళను “ప్రవక్త”గా పరిచయం చేస్తాడు. ఆమె అక్కడ ఒక ఫుడ్ ఐటమ్ తిని చనిపోతుంది. ఆమె ఇప్పుడు బతికి పునర్జన్మ గురించి మాట్లాడుతుందని చెప్తాడు. చెప్పినట్టే ఆమె మళ్ళీ బతికొస్తుంది. రీడ్, బార్న్స్ గొంతు కోసి, ఆమె కూడా తిరిగి బతుకుతుందని చెప్తాడు. కానీ పాక్స్టన్ అతని మోసాన్ని గుర్తిస్తుంది. ఇదంతా కుట్రలో భాగమని తెలుసుకుంటుంది.
ఒక రహస్య మార్గం ద్వారా పాక్స్టన్ బయటపడటానికి ప్రయత్నిస్తుంది. అక్కడ రీడ్ చాలా మంది మహిళలను బందీలుగా ఉంచినట్లు గుర్తిస్తుంది. ఇక ఈ స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. పాక్స్టన్ అక్కడి నుంచి బయట పడుతుందా ? రీడ్ అమ్మాయిలను బంధించి ఏం చేస్తుంటాడు ? దేవుడు వీళ్ళను కాపాడుతాడా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : 50 ఏళ్ల ఆంటీతో ఆటగాడి అరాచకం… ఆ పనికి నో చెప్పడంతో ఊహించని షాక్… ఫ్యామిలీతో చూడకూడని మూవీ