Mahesh Babu -Sandra : ఇటీవల కాలంలో ఎంతోమంది బుల్లితెర నటీనటులు అలాగే వెండితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇలా సెలబ్రిటీలకు సంబంధించి ఏదో ఒక శుభవార్త వినపడుతూనే ఉంది. అయితే త్వరలోనే బుల్లితెర నటుడు కూడా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది. తెలుగు బుల్లితెరపై నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మహేష్ బాబు కాళిదాసు (Mahesh Babu Kalidas)ఒకరు. మనసిచ్చి చూడు, సుభస్య శీఘ్రం సీరియల్స్ లో హీరోగా నటించిన మహేష్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం…
ఈ క్రమంలోనే ఈయన మరొక బుల్లితెర నటి సాండ్రా సుహాసిని జై చంద్రన్(Sandra Suhasini jai Chandran) తో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ముద్దమందారం, కలవారి కోడలు వంటి సీరియల్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన సాండ్రా ప్రస్తుతం ఆటో విజయశాంతి సీరియల్ లో నటిస్తోంది. అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. మహేష్, సాంద్ర ఇద్దరు కలిసి సుభస్య శీఘ్రం సీరియల్లో నటించి సందడి చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకోవడమే కాకుండా నిశ్చితార్థానికి సంబంధించిన ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
రెండో పెళ్లి చేసుకోబోతున్న నటి సాండ్రా…
ఇలా ఈ జంట నిశ్చితార్థం(Engagment) జరుపుకొని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు, ఇతర బుల్లితెర నటీనటులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి సమ ప్రయాణం అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీరిద్దరికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. ఇకపోతే నటి సాండ్రా 19 ఏళ్ల వయసుకే వివాహం చేసుకున్నారు. అయితే తన భర్త వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్న నేపథ్యంలో ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి అప్పటినుంచి ఒంటరిగా ఉన్నారు.
ఇలా సింగిల్ గానే కెరియర్ పై ఫోకస్ పెడుతూ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న సాండ్రా మహేష్ ప్రేమలో పడ్డారు. ఇక వీరి రిలేషన్ గురించి పెద్దలకు చెప్పడంతో పెద్దలు కూడా వీరి వివాహాన్ని అంగీకరించారని ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగబోతుందని తెలుస్తోంది. అయితే ఇదివరకే వీరిద్దరూ కుటుంబ సమేతంగా ఒక టీవీ షోలో పాల్గొన్నారు. ఈ వేదిక పైనే మహేష్ తన ప్రేమ విషయాన్ని సాండ్రాకు ప్రపోజ్ చేయడమే కాకుండా తన ప్రియురాలుకు ఉంగరం తొడిగారు. అయితే నేడు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో అధికారకంగా వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకున్నారని తెలుస్తోంది.
Also Read: Anasuya: వారందరికీ శాపాలు పెట్టిన అనసూయా.. చాలా బాధగా ఉందంటూ?