BigTV English

Nara Rohit: ఎన్టీఆర్ ఇష్యూ పై స్పందించిన నారా రోహిత్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Nara Rohit: ఎన్టీఆర్ ఇష్యూ పై స్పందించిన నారా రోహిత్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Nara Rohit: సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నారా రోహిత్ (Nara Rohit)ఒకరు. ఎంతో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఈయన హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. బాణం, సోలో, ప్రతినిధి వంటి విభిన్నమైన సినిమాలలో నటిస్తూ నటుడిగా తనని తాను నిరూపించుకుంటున్న రోహిత్ త్వరలోనే సుందరాకాండ(Sundarakanda) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆగస్టు 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.


ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాల్సిందే…

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా నారా రోహిత్ కు ఎన్టీఆర్(NTR) పట్ల తలెత్తిన వివాదం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్(Daggupati Prasad) ఎన్టీఆర్ గురించి అగౌరవంగా మాట్లాడుతున్న ఒక ఆడియో కాల్ లీక్ అవడంతో పెద్ద ఎత్తున వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా ఆయన క్షమాపణలు చెప్పాలని అలాగే తెలుగుదేశం పార్టీ తన పట్ల చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు.


ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్…

ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పకపోవడంతో నేడు ఎన్టీఆర్ అభిమానులు ఆయన పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే. ఇలా అనంతపురంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే విధంగా వివాదం నెలకొనడమే కాకుండా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలోనే సుందరాకాండ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న నారా రోహిత్ కు ఇదే విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ విషయం గురించి నారా రోహిత్ మాట్లాడుతూ.. తాను సుందరకాండ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నాను.

ఆ గొడవ గురించి అవగాహన లేదు…

ఎన్టీఆర్ వివాదం గురించి మీరు చెప్పే వరకు కూడా నాకు సరిగా తెలియదని అలాగే నేను మాట్లాడటానికి కూడా ఆ ఇష్యూ గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. ఇలా క్లారిటీ లేనప్పుడు ఆ అంశం గురించి మాట్లాడటం సరైనది కాదు అంటూ నారా రోహిత్ ఈ అంశాన్ని దాటవేశారు. ఇలా ఎన్టీఆర్ వివాదం గురించి నారా రోహిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ప్రశ్నలు ఎదురుకావడంతో సరైన సమయంలోనే తాను ఎంట్రీ ఇస్తానని వెల్లడించారు. తన పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు తన అన్నయ్య నారా లోకేష్ సహాయంతోనే తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. అలాగే వారి సహాయంతోనే రాజకీయాలలోకి కూడా వెళ్తానని తెలిపారు. నారా రోహిత్ మాటలను బట్టి చూస్తుంటే ఎప్పుడైనా రాజకీయాలలోకి రావచ్చని స్పష్టం అవుతుంది.

Also Read: Mahesh Babu -Sandra: ఘనంగా బుల్లితెర నటుడు మహేష్ బాబు నిశ్చితార్థం..ఫోటో వైరల్!

Related News

Actress Meena: గీతాంజలి సినిమా మీనా చేయాల్సిందా.. అలా మిస్ చేసుకుందా?

Nithiin: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ… అంతా తమ్ముడు ఎఫెక్ట్

Chiranjeevi: నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిసిన చిరంజీవి !

Sai Dharam Tej : అల్లు అర్జున్ గురించి సాయి తేజ్ లేటెస్ట్ కామెంట్స్, ఆయన ఇప్పుడు గొప్పోళ్ళు అయిపోయారు

Mowgli Release Date: మొగ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ , క్రేజీ వీడియో

K- Ramp Trailer delay : ఈ దర్శక నిర్మాతలు మారరా, ప్రేక్షకులతో ఆడుకోవడమే పని అయిపోయిందా

Silambarasan TR: ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ని పట్టుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఏకంగా శింబు తో సినిమా

‎Raviteja: ఆ డిజాస్టర్ సినిమాలంటే ఇష్టమన్న మాస్ హీరో..ఆ డౌట్ వస్తే సినిమా పోయినట్టేనా?

Big Stories

×