BigTV English

Ananya Nagalla : మృణాల్ ఏముంది భయ్యా? ఈ తెలుగు అమ్మాయి అందం చూస్తే మతిపోతుంది

Ananya Nagalla : మృణాల్ ఏముంది భయ్యా? ఈ తెలుగు అమ్మాయి అందం చూస్తే మతిపోతుంది

Ananya Nagalla : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలబడడం అనేది మామూలు విషయం కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదే కంప్లైంట్ గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది చేస్తున్నారు. ఒక సినిమా హిట్ అయిన తర్వాత విపరీతంగా అవకాశాలు రావడం అనేది కామన్ గా జరుగుతుంది.


అయితే కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా కొంతమందికి అవకాశాలు రాకుండా పోతాయి. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీలా. పెళ్లి సందడి సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. కానీ శ్రీ లీలా మాత్రం వరుసగా అవకాశాలు వచ్చాయి. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశాలు వచ్చాయి. తెలుగు హీరోయిన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం అనన్య గురించి మాట్లాడుకోవాలి.

మామూలు అందం కాదు 


అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించక పోయినా కూడా అనన్యకి మంచి పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో అద్భుతమైన గుర్తింపు సాధించుకుంది అనన్య. ఆ సినిమా కంటే ముందు ప్లే బ్యాక్ సినిమాతో కూడా మంచి గుర్తింపు సాధించుకుంది. ప్రస్తుతం సినిమాలు చేస్తూ పేరు సాధించకపోయినా కూడా నిత్యం సోషల్ మీడియాలో తను పెట్టే ఫొటోస్ కి మాత్రం వీరాభిమానులు ఉన్నారు అని చెప్పాలి.

మృణాల్ కంటే ఏం తక్కువ?

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. నిత్యం సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ అందాన్ని పొగుడుతూ చాలా పోస్టులు కనిపిస్తాయి. మృణాల్ తెలుగు హీరోయిన్ కాకపోయినా కూడా విపరీతమైన ఎలివేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ తరుణంలో కొంతమంది అనన్య నాగళ్లకు ఎలివేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. అద్భుతమైన హీరోయిన్ తెలుగులో ఉంది ఎవరయ్యా మృనాల్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి సినిమాల ద్వారా సరైన గుర్తింపు రాకపోయినా కూడా సోషల్ మీడియా వేదికగా అనన్య పెట్టిన ఫోటోలు చూస్తుంటే కుర్ర కారుకు మతిపోతుంది.

Also Read: Peddi : రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేసిన మలయాళం బ్యూటీ

Related News

Nara Rohit: ఎన్టీఆర్ ఇష్యూ పై స్పందించిన నారా రోహిత్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Kajol: కాజోల్ పై బాడీ షేమింగ్.. సిగ్గులేదా అంటూ ప్రముఖ నటి ఫైర్!

Peddi : రామ్ చరణ్ సినిమాలు రిజెక్ట్ చేసిన మలయాళం బ్యూటీ

Samantha: క్రైమ్ థ్రిల్లర్ కథతో సమంత కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

Raja saab : రాజా సాబ్ లైన్ క్లియర్, ఇంకా ఇంత వర్క్ పెండింగ్ లో పెట్టారా?

Big Stories

×