Kajol: ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఎక్కువగా బాడీ షేమింగ్ ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎలాంటి బట్టలు వేసుకున్నా.. బాడీ షేమింగ్ చేసే నెటిజన్స్ వారి శరీర ఆకృతులపై కూడా ట్రోల్స్ చేస్తూ వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ నటి కాజోల్ (Kajol) పై కూడా బాడీ షేమింగ్ కామెంట్లు చేయడంతో ఒక ప్రముఖ నటి నెటిజన్స్ పై మండిపడుతోంది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ది ట్రయల్ – 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కాజోల్..
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ఈమధ్య వరుస పెట్టి సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది. అందులో భాగంగానే ఇటీవల ‘మా’ అనే హార్రర్ థ్రిల్లర్ మూవీతో జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ‘ది ట్రయల్ – 2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 19వ తేదీన ఈ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ వేదికగా అందుబాటులోకి రాబోతోంది. ఇందులో కాజోల్ నోయోనికా సేన్ గుప్తా అనే లాయర్ పాత్రలో నటిస్తోంది. ఇక ఈమె భర్తగా జిషు సేన్ గుప్తా నటిస్తూ ఉండగా.. అలీ ఖాన్, గౌరవ్ పాండే, కరణ్ వీర్ శర్మ, సోనాలి కులకర్ణి, షిబా చద్దా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కాజోల్ పై నెటిజన్స్ బాడీ షేమింగ్..
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన కాజోల్ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరైంది. ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఇప్పుడు ఈమెకు బాడీ షేమింగ్ చేస్తున్నారు నెటిజన్స్. అసలు విషయంలోకి వెళ్తే.. బ్లాక్ డ్రెస్ లో ఈ ఈవెంట్లో పాల్గొనింది. తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమె వేసుకున్న బ్లాక్ డ్రెస్ కాస్త టైట్ గా ఉండడంతో బాడీ పార్ట్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ ఈమెపై ట్రోల్స్ చేయడమే కాకుండా ఈమె ఫోటోలను జూమ్ చేసి మరీ బాడీ షేమింగ్ చేస్తున్నారు.
నెటిజెన్స్ తీరుపై మినీ మాథుర్ మండిపాటు..
దీంతో ఇది చూసిన మినీ మాథుర్ నెటిజన్ల తీరును తప్పు పట్టింది. అసలు ఆమె బాడీని జూమ్ చేయడానికి మీకు ఎంత ధైర్యం? అందులోనూ జూమ్ చేయడమే కాకుండా బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.. సిగ్గు లేదా.. తాను ఎలా కనిపించాలి అనేది ఆమె ఇష్టం.. ఎలా ఉండాలో అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా చాలామంది నెటిజన్స్ మినీ మాథూర్ కి మద్దతుగా నిలుస్తున్నారు.
ALSO READ: Ankita Naidu: అగ్నిపరీక్ష స్టేజ్ పై అడుగుపెట్టకుండానే లాగేసారు.. నిజాలు బయటపెట్టిన అంకిత నాయుడు!
?utm_source=ig_web_copy_link