BigTV English

NTR : తాత శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం.. ఏమైంది..?

NTR : తాత శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం.. ఏమైంది..?

NTR News Latest(Breaking news in Andhra Pradesh): హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కైత్లాపూర్‌ మైదానంలో సాయంత్రం జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ NTR దూరంగా ఉండబోతున్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు, పవన్, రామ్ చరణ్‌తోపాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. కానీ తారక్ మాత్రం వేడుకలకు హాజరు కావడం లేదు.


నేడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఈ నేపథ్యంలో పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరుకావడంలేదని ప్రకటించాడు. నందమూరి నటవారసుడిగా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తాత శతజయంతి వేడుకలకు దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తాత అంటే జూనియర్ ఎన్టీఆర్‌కు చెప్పలేనంత అభిమానం. కానీ టీడీపీకి దూరంగా ఉండాలనే ఈ ఉత్సవాలకు వెళ్లడం లేదా..? అనే వార్తలు వినిపిస్తున్నాయి.లేక విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను పిలిచి తనను పిలవనందుకు అలిగాడా..? అని మరో ప్రచారం కూడా జరుగుతోంది.


హైదరాబాద్‌లో జరిగే వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించినా.. చంద్రబాబు వస్తున్నారని వెళ్లడం లేదా? అని తమ్ముళ్ల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓవైపు చంద్రబాబు పర్యటనల్లో టీడీపీ కార్యకర్తలు పదే పదే NTR పేరును ప్రస్తావిస్తూ నినాదాలు చేస్తున్నారు. తాను మాత్రం పార్టీకి దూరంగా ఉండాలనుకోవడానికి కారణాలేంటి..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంమీద వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండనుండటం.. ఎన్నో అనుమానాలను కలిగిస్తోంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×