Smartphone Comparison| 2025 సెప్టెంబర్‌లో ఆపిల్ iPhone 17 సిరీస్‌ను విడుదల చేసింది. అదే సమయంలో Xiaomi కూడా 15T సిరీస్‌ను ప్రకటించింది. ఈ రెండింటిలోనూ Pro వెర్షన్‌లు ఎక్కువ ఆకర్షణ పొందుతున్నాయి. రెండూ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్ల కోసమే రూపొందించబడ్డాయి. iPhone 17 Pro 256GB మోడల్ ధర $1,099 (సుమారు ₹91,500) నుంచి ప్రారంభమవుతుంది. Xiaomi 15T Pro 12GB/256GB మోడల్ ధర €799 (సుమారు ₹71,000). డిజైన్, పెర్ఫార్మెన్స్, కెమెరా, వాల్యూ వంటి అంశాల్లో రెండింటినీ పోల్చి ఏది బెస్ట్ అనేది ఒకసారి చూద్దాం.
డిజైన్, డిస్‌ప్లే
iPhone 17 Proలో సింగిల్-పీస్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. ఇది లైట్‌గా, కూల్‌గా అనిపిస్తుంది. గ్లాస్‌ను సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్ట్ చేస్తుంది. డిస్‌ప్లే 6.3-ఇంచ్ OLED, రెజల్యూషన్ 2622×1206, ప్రోమోషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్. Xiaomi 15T Pro చాలా స్లిమ్ (8mm) బాడీతో ఉంది. గోరిల్లా గ్లాస్ 7i కవర్, 6.83-ఇంచ్ 1.5K AMOLED డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్‌తో స్మూత్ స్క్రోలింగ్ ఇస్తుంది. రెండూ IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్. Xiaomi స్క్రీన్ పెద్దది, బ్రైట్‌నెస్ 3200 నిట్స్, iPhone మినిమలిస్టిక్ డిజైన్‌తో ప్రీమియం ఫీల్ ఇస్తుంది.
పెర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్
iPhone 17 Proలో A19 Pro చిప్ ఉంది. AI, గేమింగ్‌లో అద్భుతమైన వేగం. 12GB RAMతో మల్టీటాస్కింగ్ సులభం. iOS 26తో కనీసం 7 సంవత్సరాలు అప్‌డేట్లు వస్తాయి. Xiaomi 15T Proలో మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్ ఉంది. 12GB LPDDR5X RAMతో రా స్పీడ్‌లో ఐఫోన్ కంటే ముందంజలో ఉంది. హైపర్OS 3 (ఆండ్రాయిడ్ 15పై) మల్టీ AI టూల్స్ ఇస్తుంది. iPhone ఎకోసిస్టమ్‌లో బెటర్, కానీ Xiaomi రా పెర్ఫార్మెన్స్‌లో సూపర్ గా ఉంటుంది.
కెమెరా సిస్టమ్స్
iPhone 17 Proలో ట్రిపుల్ 48MP సెటప్. మెయిన్ ఫ్యూజన్ సెన్సార్ హై-డీటెయిల్ ఫోటోలు తీస్తుంది. 12MP అల్ట్రా-వైడ్, 5x టెలిఫోటో. ఫ్రంట్ 12MP 4K వీడియోలు. పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీలో గొప్ప. Xiaomi 15T Proలో లైకా-ట్యూన్డ్ 50MP మెయిన్, 50MP 5x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో, 12MP అల్ట్రా-వైడ్, 32MP సెల్ఫీ. వర్సటాలిటీ మరిన్ని ఆప్షన్లు. iPhone క్వాలిటీలో ముందు, Xiaomi వేరియస్ షాట్స్‌లో బెటర్.
బ్యాటరీ, చార్జింగ్
iPhone 17 Pro బ్యాటరీ 3988mAh, రోజంతా లాస్ట్ అవుతుంది. వైర్‌లెస్ చార్జింగ్ ఉంది, కానీ 90W వైర్డ్ ఛార్జర్ ఉంది. Xiaomi 15T Pro 5500mAhతో పెద్దది, 90W వైర్డ్, 50W వైర్‌లెస్‌తో త్వరగా రీచార్జ్ అవుతుంది. హెవీ యూజ్‌లో రెండూ మంచిగా పని చేస్తాయి, కానీ Xiaomi ఫాస్ట్ చార్జింగ్‌లో విన్నర్.
ధర, లభ్యత
iPhone 17 Pro బేసిక్ మోడల్ ధర $1,099 (₹91,500), 1TB $1,599 ధర (₹1,33,000). Xiaomi 15T Pro 256GB ధర €799 (₹71,000), 1TB €899 ధర (₹79,800). iPhone చాలా ప్రీమియం ధరతో వస్తుంది. కానీ తక్కువ ధరకు షావోమీ అందుబాటులో ఉంది. రెండూ గ్లోబల్‌గా అందుబాటులో ఉన్నాయి.
ఫైనల్ విన్నర్
ఆపిల్ ఫ్యాన్స్‌కు iPhone 17 Pro బెస్ట్. సాఫ్ట్‌వేర్, బిల్డ్ క్వాలిటీ సూపీరియర్. కానీ అఫర్డబిలిటీ, పవర్, జూమ్ కోసం Xiaomi 15T Pro విన్నర్. ఆపిల్ సీమ్‌లెస్ క్వాలిటీ కావాలంటే iPhone, చవకైన ఆప్షన్ కావాలంటే Xiaomi ఎంచుకోండి.
Also Read: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!