BigTV English

Puri – Sethupathi: పూరి – సేతుపతి మూవీకి వెరైటీ టైటిల్… అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో ?

Puri – Sethupathi: పూరి – సేతుపతి మూవీకి వెరైటీ టైటిల్… అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో ?

Puri – Sethupathi: టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అంటే డాష్ అండ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. వరుస హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడికి ఇటీవల కాలంలో పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోలందరూ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసే హిట్ కొట్టిన వారే. అయితే ఇటీవల పూరి ట్రాక్ కాస్త తప్పడంతో వరుస డిజాస్టర్ సినిమాలు తనని వెంటాడుతున్నాయి. ఇలాంటి తరుణంలో పూరి జగన్నాథ్ సినిమా చేయడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు.


కొత్తగా పూరి సేతుపతి సినిమా టైటిల్…

ఇలాంటి తరుణంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) పూరితో సినిమా చేయటానికి ముందుకు వచ్చారు. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.అయితే ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారు అనే విషయంపై గతంలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం భిక్షాందేహి, మాలిక్, బెగ్గర్ వంటి టైటిల్ పెట్టబోతున్నారు అంటూ గతంలో వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాకు “స్లమ్ డాగ్” (Slum Dog)అనే టైటిల్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

స్లమ్ డాగ్ గా రాబోతున్న పూరి…

పూరి సేతుపతి సినిమాకు “స్లమ్ డాగ్” పెట్టబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ విషయాన్ని రేపు సెప్టెంబర్ 28వ తేదీ అధికారికంగా టైటిల్ తో పాటు టీజర్ కూడా లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టైటిల్ చాలా వెరైటీగా ఉందని అసలు ఇలాంటి థాట్స్ పూరి జగన్నాథ్ కు తప్ప మరో ఎవరికి రావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ చూస్తుంటే కనుక హీరో ఒక పేదవాడిగా పుట్టి ధనవంతుడిగా మారే ప్రయాణమే ఈ సినిమా కథ అని తెలుస్తుంది.


విజయ్ సేతుపతితో అయిన హిట్ కొట్టేనా…

ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడిగా నటి సంయుక్త మీనన్(Samyuktha Menon) నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సినిమాలో సీనియర్ నటి టబు కూడా సందడి చేయబోతున్నారు. ఇక ఈ సినిమాని స్వయంగా పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ కు విజయ్ సేతుపతి అయిన సరైన హిట్ అందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక పూరి జగన్నాథ్ రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత లైగర్, డబల్ ఇస్మార్ట్ అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచాయనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఈ ఏడాది చివరిన లేదా వచ్చే ఏడాది మొదట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వార్తలు కూడా వినిపించాయి.

Related News

Upcoming Movies in October : అక్టోబర్ లో థియేటర్లలోకి 17 సినిమాలు… అందులో 7 మాత్రం మోస్ట్ అవైటింగ్ మూవీస్

Actor Suhas: మరో బిడ్డకు తండ్రి అయిన నటుడు సుహాస్.. ఫోటో వైరల్!

Emraan hashmi: ప్రేమకథతో రాబోతున్న మీ ఓమీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Lokah: Chapter 2: ‘లోకా’ పార్ట్‌ 2 అప్‌డేట్‌ వచ్చేసింది.. సూపర్‌ హీరోగా దుల్కర్‌, విలన్‌గా టోవినో థామస్‌!

Sai Pallavi: ఏది ఇప్పుడు చెప్పండ్రా.. సాయిపల్లవి బికినీ వేసుకుందని..

Devara 2: దేవర 2 వున్నట్టే.. మరి సెట్ పైకి వెళ్ళేదెప్పుడు ?

Allu Arjun: ఏం బన్నీ.. ఓజీ చూడడమేనా.. రివ్యూ ఇచ్చేదేమైనా ఉందా.. ?

Big Stories

×