Deceased Account Settlement: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరి అయింది. స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రభుత్వ పథకాలు, సొంత అవసరాలకు బ్యాంకు అకౌంట్ అవసరమవుతుంది. అయితే మరణించిన వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు, లాకర్లలోని వస్తువులను నామినీ లేదా వారసులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయంపై చాలా మందికి అవగాహన తక్కువ.
మరణించిన కస్టమర్ల ఖాతాలు, లాకర్ల క్లెయిమ్‌ల పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ఓ ముసాయిదా సర్క్యులర్‌ను జారీ చేసింది. ఖాతాదారులు నామినీని ప్రకటించని సమయంలో లేదా సర్వైవర్ నిబంధన లేకుండా జాయింట్ అకౌంట్ ఉన్న సందర్భాల్లో రూ.15 లక్షల వరకు క్లెయిమ్‌లను పరిష్కరించాలని బ్యాంకులను కోరింది.
ఖాతాదారుడు నామినీ ప్రకటించని సందర్భంలో డిపాజిట్ ఖాతాలలో లేదా నామినీ/సర్వైవర్ నిబంధన లేకుండా జాయింట్ ఖాతా ఉంటే చట్టపరమైన వారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని క్లెయిమ్ లు చేయాలి. బ్యాంకు, దాని రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ల ఆధారంగా రూ.15 లక్షల వరకు చెల్లించవచ్చని ఆర్బీఐ పేర్కొంది.
క్లెయిమ్ మొత్తం రూ.15 లక్షల వరకు ఉన్నప్పుడు మరణించిన డిపాజిటర్ ‘వీలునామా’ లేకపోతే లేదా ఏదైనా వివాదాస్పద క్లెయిమ్ లేదా కోర్టు ఆర్డర్ కాపీ లేని పలు మార్గదర్శకాలు సూచించింది ఆర్బీఐ.
హక్కుదారులు క్లెయిమ్ ఫామ్ నింపి, సంతకం చేయాలి.
ఖాతాదారుల మరణ ధృవీకరణ పత్రం
వారసుల ధృవీకరణ పత్రం
Annex I-C లో హక్కుదారులు సంతకం చేసిన పూచీకత్తు బాండ్
చట్టపరమైన వారసుల(క్లెయిమ్ చేయని వారు) నుంచి నిరభ్యంతర లెటర్
సంబంధిత ప్రభుత్వ అధికారుల నుంచి చట్టపరమైన వారసుల ధృవీకరణ పత్రం
మరణించిన వ్యక్తి గురించి బాగా తెలిసి, ఆ కుటుంబంతో సంబంధం లేని బ్యాంకు ఆమోదించిన స్వతంత్ర వ్యక్తి నుంచి డిక్లరేషన్
క్లెయిమ్ మొత్తం రూ.15 లక్షల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రం లేదా సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికేట్ పొందాలి.
మరణించిన వ్యక్తి కుటుంబానికి బాగా తెలిసి, ఆ కుటుంబంతో సంబంధంలేని బ్యాంకు ఆమోదించిన స్వతంత్ర వ్యక్తి ద్వారా న్యాయమూర్తి/ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు అఫిడవిట్ పై సంతకం చేయాలి.
ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ డ్రాఫ్ట్ జనవరి 1, 2026 నుండి లేదా అంతకంటే ముందు, కేంద్రం, బ్యాంకుల తుది ఆమోదానికి లోబడి అమల్లోకి రావచ్చు.
మరణించిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను సత్వర సెటిల్మెంట్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మరణించిన ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, వాటిలోని వస్తువులను నామినీలకు అప్పగించే ప్రక్రియను ఆర్బీఐ సులభతరం చేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా వీలైనంత త్వరగా ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని బ్యాంకులను కోరింది.
Also Read: PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?