India vs Pakistan, Final: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా రేపు ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. లీగ్ అలాగే సూపర్ ఫోర్ దశలో అద్భుతంగా రాణించిన టీమిండియా అలాగే పాకిస్తాన్ రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. రేపటి రోజున దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్ కంటే ముందు కచ్చితంగా ఇరు జట్ల కెప్టెన్ల ఫోటో షూట్ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆ ఫోటోషూట్ రద్దయింది.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 ) ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఫోటోషూట్ కు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డుమ్మ కొట్టారు. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణ ఉన్న నేపథ్యంలో ఫోటోలు దిగి.. మళ్లీ పరిస్థితిని మార్చకూడదని… సూర్య కుమార్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సూర్య కుమార్ యాదవ్. సూర్య కుమార్ యాదవ్ తో పాటు టీమ్ ఇండియా ప్లేయర్లు కూడా…. టీమిండియా ప్లేయర్లు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.
దీంతో పెద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ప్లేయర్లపై ఐసీసీకి కూడా పాకిస్తాన్ ప్లేయర్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ టీం ఇండియా ప్లేయర్లు మాత్రం ఎక్కడా తగ్గలేదు. రెండు మ్యాచ్లు ఆడితే రెండు మ్యాచ్ లో కూడా అలాగే వ్యవహరించింది టీమిండియా. ఇక ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఫోటోషూట్ కు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డుమ్మా కొట్టారు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ తో ఫోటో దిగడం ఇష్టం లేదని నిర్ణయం తీసుకున్న సూర్య కుమార్ యాదవ్… ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అటు ఫోటోషూట్ కోసం… పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ వచ్చి వెయిట్ కూడా చేశారట. ఎంతసేపటికి సూర్యకుమార్ యాదవ్ రాకపోవడంతో…. ఈ ఫోటోషూట్ రద్దు చేశారట. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia Cup 2025 ) భాగంగా రేపు ఫైనల్ మ్యాచ్ లో భాగంగా… టీమిండియా వర్సెస్ పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్సులున్నాయి.
Also Read: Abhishek- Gambhir: అభిషేక్ శర్మను బండబూతులు తిట్టిన గంభీర్..ఈ దెబ్బకు ఉరేసుకోవాల్సిందే
There will be no captains' photoshoot before the final of the Asia Cup. (Geo News) pic.twitter.com/SioAPvbml7
— Sheri. (@CallMeSheri1_) September 27, 2025