E-Paper
Advertisement

KA Paul: ‘బాలయ్య కడుపు చేస్తా’ అంటే ఏం చేశారు?.. శివాజీ వివాదంపై కేఏ పాల్ ఫైర్

KA Paul: ‘బాలయ్య కడుపు చేస్తా’ అంటే ఏం చేశారు?.. శివాజీ వివాదంపై కేఏ పాల్ ఫైర్
Advertisement

KA Paul: హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌పై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్ ముందు శివాజీ క్షమాపణ చెప్పారని, కానీ ఆయన ఎవరినీ కించపరచాలని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. మరోవైపు ఓ ఈవెంట్‌లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ‘మహిళలకు కడుపు చేయాలి’ అని చెప్పిన మాటలను కేఏ పాల్ గుర్తు చేశారు. మరి బాలయ్యపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ పార్టీల మద్దతు వల్ల బాలయ్యపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

టీడీపీ-బీజేపీ పొత్తు వల్లే

“బాలయ్యపై చర్యలు తీసుకోలేదేం. ఎందుకంటే బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే.. టీడీపీ, బీజేపీ పొత్తులో ఉన్నాయి. అందుకే బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చారు. వచ్చే ఏడాది భారతరత్న కూడా ఇవ్వొచ్చు. ఎందుకు ఆయన బీజేపీ పొత్తులో ఉన్నారు కాబట్టి. బీజేపీ ఎంపీ ఒకరు అత్యాచార కేసులో అరెస్టు అయ్యారు. సీబీఐ ఆ కేసును దర్యాప్తు చేసింది. అయినా అతడికి బెయిల్ వచ్చింది. అత్యాచార బాధితురాలు తనకు ప్రాణహాని ఉందని పదే పదే చెప్పినా..ఆ బీజేపీ నేతకు బెయిల్ వచ్చింది. నటుడు శివాజీ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని పొడుగుతున్నారు. అందుకే అతడిని నోటీసులు ఇస్తున్నారు. ప్రధాని మోదీ క్రిస్మస్ నాడు చర్చికి వెళ్లారు. సందేశం ఇచ్చారు. కానీ దేశ వ్యాప్తంగా చర్చిలపై దాడులు జరుగుతున్నాయి. అలా జరగకుండా చర్యలు తీసుకోవాలి. దేశాన్ని కాపాడాలి” -కేఏ పాల్

అసలేంటీ వివాదం?

Advertisement

హీరోయిన్లు బయటకు వచ్చినప్పుడు నిండుగా బట్టలు వేసుకోవాలనే ఉద్దేశంలో శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల దుస్తులు విషయంలో శివాజీ నుంచి సలహాలు అవసరం లేదని అనసూయ బహిరంగంగా కామెంట్స్ చేశారు. మెగా బ్రదర్ నాగబాబు, ప్రకాష్ రాజ్ శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. శివాజీ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణకు పిలిచింది. మహిళా కమిషన్ ముందు హాజరైన తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరినీ అవమానించాలన్న ఉద్దేశం తనకు చెప్పుకొచ్చారు. తాజాగా ఈ వివాదంపై కేఏ పాల్ స్పందించారు. బాలయ్య మహిళలపై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. శివాజీకి మద్దతుగా నిలిచారు.

Related News

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

Big Stories

Advertisement
×