E-Paper
Advertisement

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ
Advertisement

Renigunta Railway Station: కొందరు వ్యక్తులు రూటు మార్చారు. సమస్యలను పరిష్కరించుకోవాల్సింది పోయ.. పబ్లిక్ ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి రేణిగుంట రైల్వేస్టేషన్‌‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించి వీడియోలు వెలుగులోకి వచ్చింది.

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి నానాహంగమా

శుక్రవారం ఉదయం రేణిగుంట రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి నానా బీభత్సం చేశారు. రైలు ఎక్కిన సదరు వ్యక్తి.. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. ఈ సన్నివేశాన్ని గమనించిన పలువురు వ్యక్లుతు వెంటనే రైలు పైకి ఎక్కి ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఈ తతంగం జరుగుతోంది. ఆ వ్యక్తి షర్టు విప్పేసి తొలుత ఫ్లాట్ ఫారం ఫుట్‌పాత్ బ్రిడ్జి‌పై వేలాడడం మొదలుపెట్టాడు.

ఆత్మహత్య చేసుకుంటానని రైలు పైకి ఎక్కిన వ్యక్తి

Advertisement

అక్కడి నుంచి నేరుగా రైలు పైభాగానికి ఎక్కేశాడు. ఆ వ్యక్తి బెదిరింపులను గమనించిన అధికారులు, హైటెన్షన్ విద్యుత్ లైన్ పవర్ సప్లై ఆఫ్ చేశారు. ఆ వ్యక్తిని కాపాడేందుకు అధికారులతోపాటు పలువురు తీవ్రంగా ప్రయత్నాలు చేసి కాపాడారు. చివరకు రైలు పైనుంచి అతడ్ని ఎలాంటి గాయాలు కాకుండా కిందకు దింపడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

స్థానికుల సాయంతో అతడ్ని పట్టుకున్న రైల్వే పోలీసులు

అదుపులోకి తీసుకున్న ఆ వ్యక్తిని పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి అస్సాంకు చెందినవాడు. ఎందుకు ఆత్మహత్యకు చేసుకోవాలని అనుకున్నాడో దానికి సంబంధించి అతడి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన కారణంగా తిరుపతి నుంచి రేణిగుంట జంక్షన్ మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్ళాల్సిన రైళ్లు అధికారులు దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు నిలిపివేశారు. ప్రస్తుతం యథాతధంగా రైళ్లు రాకపోకలు కొనసాగుతున్నాయి.

Advertisement

ALSO READ: మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

అదుపులోకి తీసుకున్న సమయంలో అధికారులతో చట్టపరమైన అంశాలపై మాట్లాడాడట ఆ వ్యక్తి. తనను అరెస్టు చేస్తే 48 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని కోరినట్లు సమాచారం. తన వద్దకు త్రీ స్టార్‌ అధికారి రావాలని కోరాడట. వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా? మతిస్థిమితం సరిగా లేక అలా ప్రవర్తించాడా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.

 

Related News

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

వారణాసిలో చంద్రబాబు జోష్.. మోదీ పాలనపై ప్రశంసల జల్లు!

బద్వేల్ లో స్కూటీ రగడ.. పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!

సహజీవనంలో కొత్త ట్విస్ట్.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు, విజయనగరం జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×