Melbourne Accident: రోడ్డు ప్రమాదాల్లో అతి వేగం ప్రజల ప్రాణాలను బలికొంటున్నాయి. తాజాగా మెల్‌బోర్న్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ పుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఘటన సమయంలో కారు అతి వేగంగా వెళ్తున్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు.
విశాఖ షిప్‌యార్డు రిటైర్డ్ ఉద్యోగి జీటీ ప్రసాద్ ఫ్యామిలీ సీతమ్మధార ఎన్‌ఈ లేఅవుట్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ప్రసాద్ దంపతులు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్‌బోర్న్‌లోని పాయింట్ కుక్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ప్రసాద్ కొడుకు-కోడలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. కోడలు నేహ నడుపుతున్న టయోటా కారులో ఆమె అత్తతో కలిసి వెళ్లోంది. వెనుక మరో కారులో ప్రసాద్, అతడి కొడుకు వస్తున్నారు.
బుధవారం రాత్రి సుమారు 9.40 గంటల సమయంలో బోర్డ్‌వాక్ బౌలేవార్డ్-ఇన్నిస్‌ఫెయిల్ డ్రైవ్ కూడలి వేగంగా వచ్చిన పోర్షే మకాన్ కారు.. టయోటా కారును ఢీ కొట్టింది. ఘటన సమయంలో కారు 60 కి.మీ. పరిమితిలో ఉన్న జోన్‌లో వేగంగా దూసుకొచ్చింది పోర్షే కారు. టయోటాను బలంగా ఢీ కొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న నేహ, పక్కనేవున్న అత్త రమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన మరొక కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం గురించితె లియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. నేహ దంపతులకు బాబు-పాప ఉన్నారు. షిప్‌యార్డు రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్.. విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి, కోశాధికారిగా పని చేశారు. ఆస్ర్టేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య, కోడలి మృతదేహాలు విశాఖ చేరడానికి 10 రోజులు పట్టే అవకాశం ఉందని బంధువులు చెబుతున్నారు. మృతదేహాలను తరలించేందుకు అక్కడి తెలుగు కమ్యూనిటీ విరాళాలు సేకరిస్తోంది.
ALSO READ: భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..
The driver of a speeding Porsche is being questioned by detectives for his role in a deadly collision in Point Cook. pic.twitter.com/zmGfU0IM58
— 7NEWS Melbourne (@7NewsMelbourne) September 17, 2026