E-Paper
Advertisement

సహజీవనంలో కొత్త ట్విస్ట్.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు, విజయనగరం జిల్లాలో ఘటన

సహజీవనంలో కొత్త ట్విస్ట్.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు, విజయనగరం జిల్లాలో ఘటన
Advertisement

Vizianagaram district: సహజీవనం పచచని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా కుటుంబాలు ఛిన్నాభిన్నం కావడంతోపాటు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సహజీవనం చేస్తున్న ప్రియుడిపై యాసిడ్‌ పోసి చింపిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. అసలు ఏం జరిగింది?

విజయనగరం జిల్లాలో దారుణం, సహజీవనంలో కొత్త ట్విస్ట్

విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట‌లో దారుణ హత్య జరిగింది. కందిపేటకు చెందిన రాములమ్మ దంపతులకు విభేదాలు వచ్చాయి. దీంతో భర్తకు దూరంగా ఉంటోంది. తన బావ కొడుకు శ్రీనుతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. అతడు కూడా ఫ్యామిలీ సమస్యలతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో రాములమ్మ-శ్రీను సహజీవనం మొదలుపెట్టారు. అంత క్లోజ్‌గా ఉన్న వీరి మధ్య ఏం జరిగిందో తెలీదు. గురువారం తెల్లవారుజామున వీరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.

ప్రియుడిపై యాసిడ్ పోసి చంపిన ప్రియురాలు

Advertisement

అది కాస్త తారాస్థాయికి చేరింది. పట్టరాని కోపంతో రాములమ్మ ఇనుపరాడ్డుతో ప్రియుడు శ్రీను తలపై బలంగా కొట్టింది. ఇంట్లో ఉన్న యాసిడ్‌ తీసుకుని ప్రియుడిపై పోసింది. దీంతో అక్కడికక్కడే ప్రియుడు మృతి చెందాడు. ప్రియుడు మరణించడంతో షాకైన రాములమ్మ పురుగుల మందు తాగింది. ఇరుగుపొరుగువారు ఆమెని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాములమ్మ ఆరోగ్యం సీరియస్ గా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: జగన్ ప్రామిస్.. ఫుల్‌జోష్‌లో తమ్మినేని, స్టేట్ నుంచి కేంద్రానికి షిప్ట్!

Related News

బద్వేల్ లో స్కూటీ రగడ.. పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!

జగన్ ప్రామిస్.. ఫుల్‌జోష్‌లో తమ్మినేని, స్టేట్ నుంచి కేంద్రానికి షిప్ట్!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సంకేతాలు.. ఏపీకి భారీ వర్ష సూచన

బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!

విజయనగరం జిల్లాలో విషాధం.. భర్త అంత్యక్రియలకు డబ్బుల్లేక భార్య కన్నీటిరోదన!

క్రెడిట్ కొట్టేస్తున్న చంద్రబాబు.. ఎస్వీ మ్యూజియం అసలు నిజాలివే! – భూమన కరుణాకర్ రెడ్డి

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

Big Stories

Advertisement
×