Jhansi – UdayaBhanu :ఒకప్పుడు బుల్లితెర ఇండస్ట్రీలో టాప్ యాంకర్లు అనగానే వెంటనే గుర్తొచ్చేది ఉదయభాను (Udayabhanu ), సుమా (Suma ) , ఝాన్సీ(Jhansi ). ఏ టీవీ ఛానల్ పెట్టినా.. ఏ షో చూసినా.. వీరు ముగ్గురే ప్రత్యక్షమవుతారు. అంతలా ఆ రేంజ్ లో గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక కాలక్రమేనా.. “కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతుంది” అన్నట్టుగానే కొత్త యాంకర్స్ పుట్టుకొస్తున్న కొద్దీ సీనియర్ యాంకర్లకు అవకాశాలు లభించడం లేదు. అలా ఛాన్సులు లేవని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది ఉదయభాను.. ఝాన్సీ మాత్రం సినిమాల వైపు అడుగులు వేసింది. ఇక సుమ ఒకవైపు సినిమాలు.. ఒక మరొకవైపు టీవీ షోలు.. అంటూనే సినిమా ఈవెంట్లకు హోస్ట్గా వ్యవహరిస్తూ కాలం వెల్లదీస్తోంది. అయితే తాజాగా వీరి ముగ్గురిలో ఒకరైన ఉదయభాను ఇటీవల నిర్మాతగా మారి ‘పంచనామా’ అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది . మొదటి సినిమాతోనే నిర్మాతగా సక్సెస్ అందుకున్న ఈమె.. పలు ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటుంది.
అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉదయభాను.. ఇక్కడ యాంకరింగ్ అంతా సిండికేట్ అయిపోయిందని, తనకు రావలసిన ఈవెంట్లు, షోలను వేరే యాంకర్లకు ఇచ్చారని, స్టేజ్ ఎక్కే సమయంలో కూడా తనను తప్పించిన సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది ఉదయభాను. అంతేకాదు ఎవరైతే సెల్ఫ్ మోటివేషన్ తో సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటారో పైగా పిఆర్ టీం లను పెట్టుకొని ఆధిపత్యం చెలాయిస్తున్నారో అలాంటి వారికి అవకాశాలు వస్తున్నాయని ఉదయభాను కామెంట్లు చేసింది.
అయితే ఇప్పుడు ఉదయభాను కామెంట్లకు గతంలో ఝాన్సీ చేసిన కామెంట్లను ఆపాదిస్తూ గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్స్. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఝాన్సీ.. ఇండస్ట్రీలో ఎలాంటి పాలిటిక్స్ లేవు. ఇక్కడ మొత్తం క్లియర్ డివిజన్ అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది.” నేను , సుమ, ఉదయభాను.. కొన్నాళ్లు మా హడావిడి ఉండేది. మా హవా బాగా సాగింది. మేము ముగ్గురం మాత్రం ఎవరి పని వాళ్ళు చూసుకునే వాళ్ళం. మా మధ్య ఎలాంటి ఈగోలు ఉండేవి కాదు. గొడవలు లేవు.. ఎవరి పని వాళ్ళది. ఎవరి స్టూడియోలు వాళ్లవి . ఎవరి దగ్గరికి షో వస్తే వాళ్ళు ఆ షో చేసేవాళ్ళు. ఎవరి స్టైల్ వాళ్ళది. ముఖ్యంగా సుమ కామెడీగా షోలు చేస్తే, నేను ఉద్యమం అంటూ జెండాలు పట్టుకొని తిరిగే దాన్ని.. అటు ఉదయభాను అందం, గ్లామర్ తో ఆకట్టుకునేది. ఇలా ఎవరి మీటర్ వాళ్ళది . ఎవరి మధ్య కూడా గొడవలు లేవు” అంటూ ఝాన్సీ క్లారిటీ ఇచ్చింది.
also read:బిగ్ బాస్ హౌస్ లో శవపేటికలు, అస్తిపంజరాలు.. అసలేం జరుగుతోంది భయ్యా!
మరి ఝాన్సీ ఏమో ఇలా అంటుంది .. అటు ఉదయభాను ఏమో అలా అంటుంది. ఇద్దరిలో ఎవరు నిజం? అనే కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. ఏది ఏమైనా ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది . ఎవరికి ఎలా కావాలో అలాగే ఉంటుంది . ఎవరు ఎలా అనుకుంటారో అలాగే ప్రవర్తిస్తుంది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.