E-Paper
Advertisement

భారీ కొండచిలువతో ప్రజలు బెంబేలు.. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో, వీడియో వైరల్

భారీ కొండచిలువతో ప్రజలు బెంబేలు.. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో, వీడియో వైరల్
Advertisement

Hyderabad City: రోజులు మారాయి.. వాతావరణం మారింది.. వర్షకాలంలో వానలు కరువయ్యాయి. మనుషులు మారారు.. చివరకు వన్యప్రాణులు రూటు మార్చాయి. ఏకంగా జనవాసాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భారీ కొండచిలువ నానాహంగామా చేసింది. ఈ వ్యవహారానికి చెందిన వీడియో వైరల్ అవుతోంది.

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భారీ కొండచిలువ

వర్షాకాలంలో వర్షాలు లేక వన్యప్రాణులు జనావాసాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. కేవలం, జింకలు, పులులు మాత్రమే కాదు.. చివరకు విష సర్పాలు సైతం ఎంట్రీ ఇస్తున్నాయి. హైదరాబాద్ సిటీ ఐటీ కారిడాన్ నడిబొడ్డున దుర్గం చెరువు ప్రాంతంలో భారీ కొండచిలువ హల్‌చల్‌ చేసింది. ఐటీ కారిడార్ దుర్గం చెరువు సమీపంలో కొండచిలువ కనిపించడంతో ఆ ప్రాంత మీదుగా వెళ్తున్న ఉద్యోగులు, స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఎత్తైన చెట్లు, ముళ్లపొదలు, కొండ ప్రాంతాల్లో కనిపించే కొండచిలువ ఐటీ కారిడార్ పరిసరాల్లోకి రావడంతో చర్చ మొదలైంది.

భారీ కొండచిలువను చూసి బెంబేలెత్తిపోయిన స్థానికులు

Advertisement

దుర్గం చెరువు సమీపంలో చుట్టుపక్కల కొండలు, గుట్టలు ఉండేవి. అయితే కాలక్రమేణా తొలగించడం, ఆ తర్వాత నిర్మాణాలు పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో విష సర్పాలు సైతం జనావాసాల ప్రాంతాల్లోకి రావడం మొదలుపెట్టాయి. కొండచిలువ కనిపించడంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వాహనాలను ఆపి కొందరు దూరంగా వెళ్లారు. మరికొందరు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. పరిస్థితిని గమనించిన ఓ ఉద్యోగి ముందుకు వెళ్లి కొండచిలువను పట్టుకున్నాడు. అక్కడి నుంచి దాన్ని మరొక ప్రాంతానికి తరలించారు.

ALSO READ: యూట్యూబర్‌ వైష్ణవి భర్త హత్యలో కొత్త ట్విస్ట్‌.. హ‌రిబాబును నేనే చంపేశా, ఎలా ప్లాన్ చేశానంటే

Advertisement

దుర్గం చెరువు పరిసరాల్లో ఒకప్పుడు కొండలు, గుట్టలు ఉండేవి. ప్రస్తుతం అవన్నీ తగ్గిపోవడంతో కొండచిలువలు, విష సర్పాలు బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో సరీసృపాలు ఇంకా ఉండే అవకాశం ఉందని, ఈ విషయంలో ఆ ప్రాంతానికి వెళ్లే ఐటీ ఉద్యోగులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

Related News

పుట్టుకతో భూములుంటే ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు లేదు.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సూటి ప్రశ్న

యూట్యూబర్‌ వైష్ణవి భర్త హత్యలో కొత్త ట్విస్ట్‌.. హ‌రిబాబును నేనే చంపేశా, ఎలా ప్లాన్ చేశానంటే

కేసీఆర్, సీఎం రేవంత్ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? – కేటీఆర్

సీఎం రేవంత్‌ రెడ్డిపై రెడ్ బుక్ రాస్తున్నాం.. ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!

ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్.. యూకే వర్సిటీల ప్రతినిధులతో సీఎం రేవంత్ కీలక భేటీ

బాంబ్ పేల్చిన విప్ ఆది శ్రీనివాస్.. కేటీఆర్ 7289 డాక్యుమెంట్ సీక్రెట్ ఇదేనా?!

‘అప్పుడు Zero.. ఇప్పుడు రూ.వేల కోట్లు’.. కేసీఆర్‌, కేటీఆర్‌పై పొంగులేటి నిప్పులు!

Big Stories

Advertisement
×