E-Paper
Advertisement

బద్వేల్ లో స్కూటీ రగడ.. పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!

బద్వేల్ లో స్కూటీ రగడ..  పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!
Advertisement

Badvel Knife Attack: కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని భవనారాయణ నగర్ ఇదీ. ఇదే ఏరియాలో వెంకట మదన్, దినేష్ అనే అన్నదమ్ములు ఉన్నారు. తమ పని తాము చేసుకుంటూ ఉండేటోళ్లు. కానీ నెల రోజుల క్రితం ఒక స్కూటీ విషయంలో యశ్వంత్ అనే ఒక పోకిరీ గాడితో చిన్న గొడవ జరిగింది. పోనిలే అని ఆ సోదరులు ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. కానీ ఈ యశ్వంత్ ఆ గొడవను అంత ఈజీగా తీసుకోలేదు. మనసులోనే పగ పెంచుకుని, ఆ అన్నదమ్ములను ఎలాగైనా అటాక్ చేయాలని లోపల బిగ్ స్కెచ్ వేస్తూ వచ్చాడు.

రాజీ పడదామని పిలిచి కత్తితో..

Advertisement

పాత గొడవలు ఎందుకురా.. కూర్చుని సెటిల్ చేసుకుందాం అంటూ మాటలతో నమ్మించాడు. గుంతపల్లి క్రాస్ రోడ్డుకి ఆ అన్నదమ్ములను పిలిపించాడు ఆ రాస్కెల్. నమ్మి అక్కడికి వచ్చిన ఆ అమాయకులతో కాసేపు మాట్లాడినట్లు డ్రామా ఆడాడు. సడన్‌గా మాటామాటా పెరగడంతో.. ముందుగానే ప్లాన్ ప్రకారం దాచుకున్న పదునైన కత్తి బయటికి తీసి ఇద్దరిని పొడిచేశాడు.

కత్తితో కసి తీర్చుకున్న సైకో!

Advertisement

రక్తంతో నిండిన అన్నదమ్ముల ఆర్తనాదాలు విని స్థానికులు పరిగెత్తుకు రావడంతో.. ఈ సైకో యశ్వంత్ గాడు అక్కడి నుంచి జంప్ అయ్యాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న వెంకట మదన్, దినేష్‌ను హుటాహుటిన బద్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో కడప RIMS కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ కసాయి యశ్వంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Also Read:కేసీఆర్, రేవంత్ రెడ్డికి డీఎన్ఏ టెస్ట్ చేయాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు! 

Tags

Related News

సహజీవనంలో కొత్త ట్విస్ట్.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు, విజయనగరం జిల్లాలో ఘటన

జగన్ ప్రామిస్.. ఫుల్‌జోష్‌లో తమ్మినేని, స్టేట్ నుంచి కేంద్రానికి షిప్ట్!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సంకేతాలు.. ఏపీకి భారీ వర్ష సూచన

బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!

విజయనగరం జిల్లాలో విషాధం.. భర్త అంత్యక్రియలకు డబ్బుల్లేక భార్య కన్నీటిరోదన!

క్రెడిట్ కొట్టేస్తున్న చంద్రబాబు.. ఎస్వీ మ్యూజియం అసలు నిజాలివే! – భూమన కరుణాకర్ రెడ్డి

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

Big Stories

Advertisement
×