Top dishwasher machines India 2026: ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో వంట చేయడం ఎంత కష్టమో, ఆ తర్వాత సింక్‌లో పడి ఉన్న గిన్నెలను శుభ్రం చేయడం అంతకంటే పెద్ద సవాల్‌గా మారుతోంది. ముఖ్యంగా మన వంటకాల్లోని నూనె, నెయ్యి, అడుగంటిన మసాలాలు గిన్నెలకు, కడాయిలకు గట్టిగా అతుక్కుపోతాయి. వీటిని మామూలుగా చేతులతో తోమితే కొన్ని సార్లు ఒళ్లు నొప్పులు రావడంతో పాటు బోలెడంత సమయం వృధా అవుతుంది. ఇలాంటి వారి కోసమే మార్కెట్లో సరికొత్త టెక్నాలజీతో వచ్చిన ఆటోమేటిక్ డిష్‌వాషర్లు వంటింటి పనిని మరింత ఈజీ చేస్తున్నాయి. ప్రత్యేకించి పెద్ద కడాయిలు, కుక్కర్లు ఈజీగా పట్టేలా కూడా వీటిని డిజైన్ చేసారు. ఇండియన్ హోమ్స్‌కు సరిగ్గా సరి పోయే బెస్ట్ 5 డిష్‌వాషర్లు ఏంటి ? వాటి ఫీచర్లు, ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది మహిళల మొదటి ఆప్షన్‌గా ఈ బ్రాండ్ నిలుస్తోంది. మార్కెట్లో వీటి ధర సుమారు రూ.43,000 నుంచి రూ.52,500 వరకు ఉంటుంది. ఈ డిష్ వాషర్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో.. ఉన్న ఇంటెన్సివ్ కడాయి ప్రోగ్రామ్ నూనె జిడ్డు బాగా ఉన్న కడాయిలు, ప్రెజర్ కుక్కర్లను ముందుగా కడగడం అవసరం లేకుండానే శుభ్రం చేస్తుంది. 4 నుంచి 6 మంది సభ్యులున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.
పెద్ద కుటుంబాల కోసం ఈ బ్రాండ్ అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. దీని ధర సుమారు రూ.38,000 నుంచి రూ. 45,000 మధ్య లభిస్తుంది. ఇది 360-డిగ్రీ జెట్ వాషింగ్, డీప్ క్లీన్ టెక్నాలజీతో వస్తుంది. దీనిలోని ఎత్తు సర్దుబాటు చేసుకునే రాక్స్ కారణంగా పెద్ద సైజు కడాయిలు, లోతైన గిన్నెలు ఈజీగా సరి పోతాయి. అంతేకాకుండా.. వేడి నీటితో వాష్ చేయడం వల్ల బ్యాక్టీరియా నశించి, గిన్నెలు కొత్తగా మెరుస్తాయి.
ప్రీమియం లుక్ , లేటెస్ట్ టెక్నాలజీ కోరుకునే వారికి ఎల్జీ క్వాడ్‌వాష్ డిష్ వాషర్ మంచి ఆప్షన్. దీని ధర దాదాపు రూ. 49,900 వరకు ఉంటుంది. ఇది నీటి తుంపర్లను వివిధ కోణాల్లో పంపిస్తూ గిన్నెల మూలమూలన ఉన్న మసాలా మరకలను వదిలిస్తుంది. దీనిలోని ట్రూ-స్టీమ్ టెక్నాలజీ గిన్నెలపై నీటి మరకలు పడకుండా చాలా శుభ్రంగా ఆరబెట్టడంలో సహాయ పడుతుంది.
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కెపాసిటీ కావాలనుకునే.. వారికి ఇది చక్కటి ప్రత్యామ్నాయం. దీని ధర సుమారు రూ. 27,000 నుంచి రూ. 30,000 లోపు లభిస్తుంది. ఇందులో ఉండే అక్వా ఇంటెన్స్ ఫీచర్ అడుగున మాడిపోయిన అన్నం లేదా కూరల మరకలను సైతం ఈజీగా వదిలించగలదు. ఇది తక్కువ నీటిని వాడుతూ ఎక్కువ గిన్నెలను శుభ్రం చేయగలగడం దీని ప్రత్యేకత.
Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. రోజులు తరబడి టెన్షన్ ఫ్రీ
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఆటోమేటిక్ డిష్ వాషర్ కోరుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది. దీని ధర సుమారు రూ. 25,000 నుంచి రూ.32,000 మధ్య ఉంటుంది. దీనిలోని హైజీన్ ఇంటెన్సివ్ వాష్ మోడ్ , సోక్ మోడ్ గిన్నెలను నానబెట్టి మరీ శుభ్రం చేస్తాయి. హెవీ ఇండియన్ కుకింగ్ చేసే ఇళ్లలో ఇది చక్కగా పని చేస్తుంది.
మీ వంటింటి కష్టాలను దూరం చేయడానికి ఈ డిష్‌వాషర్లు ఎంతగానో సహాయ పడతాయి. మీ కుటుంబ సభ్యుల సంఖ్య ,బడ్జెట్ బట్టి సరైన దాన్ని ఎంచుకుంటే.. సమయం ఆదా కావడంతో పాటు కిచెన్ కష్టాల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.