BigTV English

Amaravati News: త్వరలో ఏపీకి భారీ పెట్టుబడులు.. ప్రిజనరీకి-విజనరీకి అదే తేడా-మంత్రి లోకేష్

Amaravati News: త్వరలో ఏపీకి భారీ పెట్టుబడులు.. ప్రిజనరీకి-విజనరీకి అదే తేడా-మంత్రి లోకేష్
Advertisement

Amaravati News: గూగుల్ పెట్టుబడులు విశాఖ నగరం రూపురేఖలు మారనున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదని, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నట్లు వివరించారు. ఇదే కాకుండా భారీ పెట్టుబడులపై అన్నిచోట్ల చర్చలు జరుగుతున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. విశాఖకు గూగుల్ రావడం అతిపెద్ద విజయమన్నారు.


ఏపీకి మరిన్ని పెట్టుబడులు, చర్చల దశలో

ఐటీ రంగంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఛాలెంజ్‌గా తీసుకున్నామని వివరించారు. రానున్న రోజుల్లో ఏఒక్క కంపెనీ ఏపీ నుంచి వెళ్లే పరిస్థితి రాదన్నారు. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయని, ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉందన్నారు. ప్రిజనరికీ-విజనరీకి చాలా తేడా ఉందన్నారు. బుధవారం ఉదయం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.


గూగుల్ పెట్టుబడి వల్ల లక్షమందికి పైగా ఉపాధి అవకాశాలు రానున్నట్లు వివరించారు. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. గ్రేటర్ విశాఖను ఓ  ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలన్నదే మా గోల్ అని వివరించారు.

కేంద్ర-రాష్ట్రాలవల్లే సాధ్యం

అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. క్లస్టర్ బేస్ అప్రోచ్ ద్వారా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నట్లు చెప్పారు. గతంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ రావడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిందన్నారు. గతేడాది సెప్టెంబరులో గూగుల్ ప్రతినిధులు విశాఖ వచ్చినప్పుడు వారితో సమావేశమైనట్టు చెప్పుకొచ్చారు.

డేటా సెంటర్‌కు ఇవ్వాల్సిన భూములను చూపించామని, అది జరిగిన నెల రోజులకు అమెరికా వెళ్లానని తెలిపారు. అక్కడ గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిశానని వివరించారు. నవంబరులో గూగుల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారని గుర్తు చేశారు. ఈ అంశంపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం చంద్రబాబు పలుమార్లు భేటీ అయ్యారని తెలిపారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.

ALSO READ: విశాఖకు గూగుల్.. జగన్ కు మాటల్లేవ్

అనేక చర్చల తర్వాత భారీ పెట్టుబడి ఏపీకి సాధ్యమైందన్నారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యమన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీకి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. జీసీసీ కోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామన్నారు.

అనంతపురం-కర్నూలులో పంప్డ్ స్టోరేజ్, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు-కడపలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. నెల్లూరు శ్రీసిటీలో అనేక పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యంగా డైకెన్, బ్లూస్టార్, ఎల్జీ వంటి కంపెనీలు పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు.  ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందన్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వాను పెద్ద ఎత్తున ప్రొత్సహిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చేయడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు వివరించారు. ఒప్పందాల కంటే పరిశ్రమ ఏర్పాటుపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు వివరించారు. ప్రతీ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నవంబర్ లో మరిన్ని శుభవార్తలు ఉంటాయని అన్నారు.

 

 

Related News

Kakinada SEZ Controversy: కాకినాడ సెజ్ రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

Guntur: దారుణం.. రన్నింగ్‌ ట్రైన్‌లో మహిళపై దుండగుడు అత్యాచారం!

Google – Jagan: విశాఖకు గూగుల్.. జగన్ కు మాటల్లేవ్

Andhra Pradesh: అమరావతి రాజ్ భవన్‌ నిర్మాణానికి రూ.212 కోట్లతో మాస్టర్ ప్లాన్..

Kakinada SEZ Lands: మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్.. ఆ భూములు తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్

Jagan – Ysrcp: అంటీముట్టనట్టుగా వంశీ, నాని, అనిల్.. జగన్ 2.Oపై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదా..?

Tirumala Pushpayagam 2025: అక్టోబర్ 30న తిరుమల శ్రీవారి పుష్పయాగం.. ఆర్జిత సేవలు ర‌ద్దు!

Big Stories

×