Kantara Chapter 2:ప్రముఖ కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishabh Shetty) ‘కాంతార’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా.. దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయనను స్టార్ హీరో అనాలో.. లేక స్టార్ దర్శకుడు అనాలో తెలియడం లేదు అంటూ ఆయనపై రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) కూడా ప్రశంసలు కురిపించారు. దీన్ని బట్టి చూస్తే రిషబ్ శెట్టి ఏ రేంజ్ లో ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కాంతార సినిమాతో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి.. దానికి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతి నాయకుడిగా కనిపించారు. జయరామ్ కీలకపాత్ర పోషించారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ్ ,హిందీ, మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. 12 రోజుల్లోనే 675 కోట్ల కలెక్షన్లు వస్తువులు చేసి బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసింది. 16వ శతాబ్దంలో జరిగే కథగా తెరకెక్కించిన ఈ సినిమాలో అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా చిత్రబృందం చాలా కష్టపడిందని చెప్పవచ్చు.
ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్ లో కాంతార చాప్టర్ 2 కూడా ఉంటుందని రిషబ్ శెట్టి రివీల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఇంకా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ తాజాగా గూస్ బంప్స్ తెప్పించే ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. కాంతార చాప్టర్ 2 సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించినబోతున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ తల్లి షాలిని సొంత ఊరు కర్ణాటక. పైగా రిషబ్ శెట్టికి ఎన్టీఆర్ మంచి స్నేహితుడు కూడా.. ఆ స్నేహబంధం తోనే ఎన్టీఆర్ కి ఒక అదిరిపోయే పాత్రను ఈ సినిమాలో కల్పించబోతున్నట్లు సమాచారం.
ALSO READ:Hrithik Roshan: ఢిల్లీ హైకోర్టుకు హృతిక్ రోషన్.. నేడే విచారణ!
కథకు ఆయువు పట్టు లాంటి ఒక పాత్రను ఎన్టీఆర్ కోసం డిజైన్ చేశారట. కీలక పాత్రలో ఎన్టీఆర్ నటిస్తారని.. ఆయన నటించే 30 నిమిషాల పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందని.. ముఖ్యంగా ఆయన పాత్రతో కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయని నెట్టింట ఒక వార్త వినిపిస్తోంది. ఒకవేళ రిషబ్ శెట్టి ఎన్టీఆర్ కోసం ఇలాంటి ఒక పాత్ర రాసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే.. ఇప్పటివరకు కాంతార చాప్టర్ 1తో బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన రిషబ్ శెట్టి.. కాంతార చాప్టర్ 2తో ఏకంగా 1000కోట్ల క్లబ్లో చేరుతారు అనడంలో సందేహం లేదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం వినడానికి చాలా సంతోషంగా ,ఎక్సైటింగ్ గా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.