ఇన్ స్టా గ్రామ్ కారణంగా ఎప్పుడు? ఎవరు? ఎలా పాపులర్ అవుతారో చెప్పడం కష్టం. రాత్రికి రాత్రే ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలాగే గత వారం రోజులుగా ఒక కపుల్ బీభత్సంగా వైరల్ అయ్యారు. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. ఇంతకీ వీళ్లు ఎవరు? ఎందుకు వైరల్ అయ్యారు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మనమూ వారి గురించి తెలుసుకుందాం..
రాజమండ్రికి చెందిన భవానీ,రామ్ కు నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. డిప్లొమా పూర్తయిన తర్వాత ఏదైనా జాబ్ చేసుకుంటూ, సినిమా పరిశ్రమలోకి రావాలని రామ్, తన భార్యతో కలిసి రాజమండ్రి నుంచి భాగ్యనగరానికి వచ్చాడు. ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. కానీ, గత కొంత కాలంగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. నెమ్మదిగా అతడి భార్య భవానీతో సాంగ్స్ పాడించే వాడు. ఆ తర్వాత ఆమె పాటలు పాడుతుంటే, వెనుక ఉండి మ్యూజిక్ ఇచ్చేవాడు. అలా యూట్యూబ్ లో మంచి ఫాలోవర్స్ సంపాదించాడు. ఆమె పాట పాడటం, అతడు దానికి మ్యూజిక్ ఇవ్వడం ద్వారా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వీరి ‘నల్ల జిలకర మొగ్గ’ అనే పాట ట్రెండింగ్ లో ఉంది.
ఇక గతంలో రామ్ ఉద్యోగం చేసే సమయంలో కుటుంబం బాగానే గడిచేది. ప్రస్తుతం ఆయన ఉద్యోగానికి వెళ్లపోయినా, యూట్యూబ్ నుంచి కొంత ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఫ్యామిలీ గడిచేందుకు అవసరం అయిన డబ్బులు అందుతున్నాయంటున్నారు. ఇప్పటికే సిల్వర్ బటన్ వచ్చిందన్నారు. మున్ముందు నెటిజన్లు అండగా నిలిస్తే, గోల్డెన్ బటన్ కూడా తీసుకుంటామని చెప్పారు. తనకు ఆపదలో యూట్యూబ్ ఆదుకుంటుందన్నారు భవానీ రామ్. ఫాలోవర్స్ పెరిగడంతో పాటు వ్యూస్ సాధించడం వల్ల ఇంకా ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. చిన్నప్పటి నుంచి సినిమా పరిశ్రమలోకి వెళ్లాలని తనకు ఆసక్తి ఉందన్న రామ్, ఎదో ఒకరోజు ఆ కోరిక నెరవేరాలని వేచి చూస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ సినిమా పరిశ్రమలోకి వెళ్లినా యూట్యూబ్ ను వదలబోమన్నారు.
యూట్యూబ్ లైవ్ పెట్టే సమయంలో చాలా ఇబ్బంది ఎదురవుతుందన్నారు భవానీ రామ్. చాలా సేపు డ్యాన్స్ చేయడం, వెనుక నుంచి పాటకు తగినట్లుగా మ్యూజిక్ ఇవ్వడం అంత ఈజీ కాదన్నారు. అయినప్పటికీ, వీక్షకులను ఎంటర్ టైన్ చేయడం కోసం బాధ కలిగినా భరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక సోషల్ మీడియాలో తమ గురించి జరుగుతున్న ట్రోలింగ్ కూడా బాధ కలిగించడం లేదన్నారు. ఒకప్పుడు తమను తిట్టిన వాళ్లే ఇప్పుడు, అభినందిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఇక బిగ్ బాస్ గురించి భవాని షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు ఆ షో అంతగా నచ్చదని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో జరిగే గొడవలు, కొత్త స్నేహాలు తనకు అంతగా నచ్చవన్నది.
Read Also: కొత్త పెళ్లి కూతుళ్ల మాస్టర్ ప్లాన్, భర్తల ఇళ్లకే కన్నం వేసిన 12 మంది భార్యామణులు!