IND VS AUS: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వర్సెస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య వివాదాలు రోజురోజుకు ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ ప్రవర్తన కారణంగా టీమిండియాలో చీలిక వచ్చే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వీళ్ళ ముగ్గురి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇవాళ ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణమైంది టీమిండియా. అయితే ఢిల్లీకి వెళ్లే ముందు అందరూ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభేరుకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు మాత్రం నేరుగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి టీం ఇండియాలో కలిసిపోయారు. అనంతరం ప్లేయర్లతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు గౌతమ్ గంభీర్ కు మాత్రం ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిపోర్ట్ చేయలేదట. తమపై గౌతమ్ గంభీర్ పగ పెంచుకున్నాడు అన్న కోపంతో రగిలిపోతున్నారట రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ. అంతేకాదు నిన్న గౌతమ్ గంభీర్ పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో గౌతమ్ గంభీర్ కు టీమిండియా క్రికెటర్లు అలాగే మాజీ ప్లేయర్లు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. కానీ మహేంద్ర సింగ్ ధోనితో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం గౌతమ్ గంభీర్ కు శుభాకాంక్షలు తెలపలేదని తెలుస్తోంది. ఇక ఇవాళ రిపోర్ట్ చేయకుండానే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. దీంతో టీం ఇండియాలో చీలిక ఏర్పడిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు సిరీస్ జరగనుంది. ఇందులో వన్డేలు అలాగే t20 మ్యాచ్ లు జరుగుతాయి. టీమిడియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 23వ తేదీన రెండవ వన్డే అలాగే అక్టోబర్ 25వ తేదీన మూడో వన్డే జరుగుతుంది. అక్టోబర్ 29వ తేదీ నుంచి టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ రెండు జట్ల మధ్య ఐదు టీ20లు జరుగుతాయి. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20లు ఆడనుంది టీమిండియా ( Team India) జట్టు.
INDIA TEAM TAKES OFF FOR AUSTRALIA… READY FOR THE ODI TOUR!!! 🇮🇳pic.twitter.com/X2tcIfEGfZ
— GillTheWill (@GillTheWill77) October 15, 2025