Bigg Boss 9 Telugu: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 లో రోజుకు ఉత్కంఠ భరితమైన గొడవలు జరుగుతున్నాయి. ఐదో వారం వరకు సాఫీగా సాగిపోతున్న హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గొడవలను క్రియేట్ చేశాడు బిగ్ బాస్. ఈ వీకెండ్ నామినేషన్స్ ఎంత రచ్చగా సాగాయో మనం చూసాం. కొత్త వాళ్లు హౌస్ లోకి వచ్చి రాకతలికి పాత వాళ్లతో గొడవలకు దిగారు. ఇలానే కొనసాగితే బిగ్ బాస్ ను ఆడియన్స్ చూడ్డం మానేస్తారని కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్ ని హౌస్ లోకి తీసుకురాబోతున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆమె ఎవరో కాదు శ్రీజ.. ఈవారం హౌస్ లోకి ఏమైనా రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈవారం వైల్డ్ కార్డు ద్వారా కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. కొత్త వాళ్ల ద్వారా ఆడియన్స్ కి ఆసక్తి కలిగించాలని బిగ్ బాస్ అనుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి చూస్తే ఆడియన్స్ బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్నట్లు తెలుస్తుంది. కొత్త వాళ్ళను తీసుకురాకుండా ఉంటే బాగుండు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఇలాంటి వార్తలను అధిగమించాలంటే పాత కంటెస్టెంట్ లో స్ట్రాంగ్ గా అనిపించిన మరొకరిని హౌస్ లోకి దించాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఏంటంటే.. గతవారం ఎలిమినేట్ అయిన దమ్ము శ్రీజను వైల్డ్ కార్డు ద్వారా మళ్ళీ హౌస్ లోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఖచ్చితంగా ఆమె ఎంట్రీ ఉంటే మాత్రం హౌస్ ని దడ దడ లాడిస్తుంది అంటూ నెట్టింట ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..
Also Read : ప్రేమను అసహ్యించుకున్న ధీరజ్.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. తెగించేసిన సాగర్..
బిగ్ బాస్ సీజన్ 9 ఆరో వారం నామినేషన్స్ హీటెక్కించాయి.. అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఎవరు ఈసారి హౌస్ నుంచి బయటకు వెళ్తారా అన్న ఆసక్తి ఆడియన్స్లో నెలకొంది. ప్రస్తుతం హౌస్మెట్స్ ముగ్గురిని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. భరణి, దివ్య, తనుజ.. ఈ ముగ్గురిపై కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు కూడా కోపంగా ఉన్నారని గత ఎపిసోడ్ ను చూస్తే అర్థం అవుతుంది. అయితే ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారా? హౌస్ లో అంతో ఇంతో భరణి కంటెంట్ ని క్రియేట్ చేస్తున్నాడు.. తనుజ కూడా తనదైన స్టైల్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక దివ్య ఫైర్ బ్రాండ్ లాగా రెచ్చిపోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. గత వారం ఇద్దరినీ ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్.. ఈవారం ముగ్గురిని ఎలిమినేట్ చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లు టాక్.. ఆ ముగ్గురు ఈ ముగ్గురేనా? గత వారం డేంజర్ జోన్లోకి వచ్చిన రీతూ ఉందా..? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ వారం ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..