Konaseema Crime: కారణాలు ఏమైనా కావచ్చు. ఏమీ తెలియని పసి వయస్సులో చిన్నారులు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. ఈ మధ్య తెలుగురాష్ట్రాల్లో పిల్లలను చంపేస్తున్నారు తల్లిదండ్రులు. వారితోపాటు పిల్లలను పైలోకానికి తీసుకుపోతున్నారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులను చంపాడు కన్నతండ్రి. ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలేం జరిగింది?
తెలుగు రాష్ట్రాల్లో ఘోరం.. పిల్లను చంపేస్తున్న పేరెంట్స్
ఉమ్మడి తూరుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఆలమూరు మండలం చిలకలపాడు గ్రామానికి చెందినవాడు కామరాజు. ఆయన వయస్సు 35 ఏళ్లు. చిన్నవయస్సులో వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అభిరామ్‌కు పదేళ్లు కాగా, గౌతమ్‌కు ఏడేళ్లు. కామరాజు గతంలో వాలంటీర్‌గా పని చేసేవాడు.
భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదుగానీ, 2020లో కామరాజు భార్య ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి కామరాజు జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు చదువుతున్నాడు. భార్య మరణించిన తర్వాత జీవితం ఏంటో కామరాజుకు తెలిసి వచ్చింది. అప్పటి నుంచి పిల్లలను పెంచుతున్నాడు. ఎందుకోగానీ జీవితంపై కామరాజుకు విరక్తి కలిగింది. చివరకు కామరాజు చనిపోవాలని భావించాడు.
తూర్పుగోదావరిలో పిల్లలను చంపి, ఆపై తండ్రి కూడా
పిల్లలు అనాథలు అయిపోతారని భావించాడు. పిల్లలను చంపేసి, ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామరాజు ఫ్యామిలీ సూసైడ్ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి వారంతా విగతజీవులుగా ఉన్నారు. కామరాజు బంధువులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం వారి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.
రీసెంట్‌గా మంగళవారం హైదరాబాద్‌లో సాయిలక్ష్మి గృహిని, తన ఇద్దరు పిల్లలను చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన అనిల్ కుమార్ హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. హైదరాబాద్‌లో సెటిలైన సాయిలక్ష్మితో మూడేళ్ల కిందట వివాహం జరగింది.
ఈ దంపతులకు కవల పిల్లలు పుట్టారు. ఒకరు కూతురు, మరొకరు కొడుకు. కుమారుడికి మాటలు సరిగ్గా రావడంతో నిత్యం భార్యని వేధించేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో సాయిలక్ష్మి.. తన పిల్లలను చంపి ఆమె సూసైడ్ చేసుకుంది. ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు.