BigTV English

Lokesh Yuvagalam: “బస్సుయాత్ర ఒక తుస్సు యాత్ర.. మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది”

Lokesh Yuvagalam: “బస్సుయాత్ర ఒక తుస్సు యాత్ర.. మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది”

Lokesh Yuvagalam: స్కిల్ డెవలప్ మెంట్ లో.. చంద్రబాబు స్కామ్ చేశారని ఆరోపించి.. ఆయన్ను జైలుకు పంపిన పెద్ద ఒక్క ఆధారాన్నైనా చూపించారా ? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. యువగళం పాదయాత్రను పునః ప్రారంభించిన లోకేశ్.. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీ అధినేత చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని విమర్శించారు. తనపై కూడా కేసులు పెట్టిన సీఐడీ అధికారులు.. అందుకు తగిన ఆధారాలను చూపలేకపోయారన్నారు. తాము ఏ తప్పూ చేయలేదు కాబట్టే.. మళ్లీ యువగళం పాదయాత్రతో ప్రజల ముందుకి వచ్చినట్లు పేర్కొన్నారు.


స్కిల్ కేసులో బాబును అరెస్ట్ చేసిన వారు.. ఒక్క ఆధారాన్నైనా చూపించారా ? టీడీపీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా ? అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. వెనక్కి తగ్గబోమని లోకేశ్ స్పష్టం చేశారు. మీ కౌంట్ డౌన్ మొదలైందని మంత్రులను హెచ్చరించారు. వైసీపీ చేసినట్టే.. తాము కూడా చేస్తే వైసీపీ నేతలంతా జైల్లోనే ఉంటారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా మొత్తం చెల్లించే బాధ్యత తనదేనని లోకేశ్ తెలిపారు. చంద్రబాబును జైలుకు పంపితే పాదయాత్ర ఆగిపోతుందని వైసీపీ నేతలు భావించారని, కానీ.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం ఆగదన్నారు. వైసీపీ బస్సు యాత్ర ఒక తుస్సుయాత్రగా మారిందని, రావాలి జగన్.. కావాలి జగన్ నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ అని ప్రజలు అంటున్నారని గుర్తుచేశారు.


Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×