Big Stories

Fake Reporter: ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. ఫేక్ రిపోర్టర్ అరెస్ట్..

fake reporter

Fake Reporter: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశాడో యుట్యూబర్‌. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ సూర్యారావు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మేకల భాను అనే యుట్యూబర్‌ ను అరెస్టు చేసి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం భానుకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

- Advertisement -

మేకల భాను.. ప్రజాకోర్టు పేరుతో యూ ట్యూబ్‌ ఛానల్‌ ఏర్పాటు చేశాడు. తానో జర్నలిస్ట్‌ అని చెప్పకుంటూ పలువురిని బ్లాక్‌ మెయిల్‌ చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. గతంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ భర్తతో మేకల భానుకు వివాదం ఉంది. తనను బెదిరించానంటూ పెట్రోల్‌ బాటిల్‌ తో పీఎస్‌ ముందు బైఠాయించాడు. అప్పుడు పోలీసులు భానును.. అదుపులోకి తీసుకుని వదిలేశాడు. ఇదే విషయంలో తన బంధువులను బ్లాక్‌ మెయిల్‌ చేశాడంటూ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఎంపీపీ భర్త దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

మేకల భానుపై పలు పోలీస్‌ స్టేషన్లలో దాదాపుగా 9కి పైగా కేసులు ఉన్నాయి. భాను బాధితులు మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో ఇటీవల వాట్సప్‌ గ్రూప్‌ లు విపరీతంగా పెరిగాయని.. జర్నలిస్టులమని మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News