E-Paper
Advertisement

Rayudu Political Entry: రాయుడు పొలిటికల్ ఎంట్రీ! వైసీపీ,టీడీపీ, బీజేపీ నుంచి ఆఫర్లు..

Rayudu Political Entry: రాయుడు పొలిటికల్ ఎంట్రీ! వైసీపీ,టీడీపీ, బీజేపీ నుంచి ఆఫర్లు..
Advertisement

Rayudu Political Entry: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. కొద్దిరోజులుగా రాజకీయాల్లో వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ క్రికెటర్ క్లారిటీ ఇచ్చారు. తాను పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించేశారు. ప్రజాసేవకు ముందు అన్ని విషయాలను తెలుసుకునే పనిలో అంబటి రాయుడు బిజీగా ఉన్నారు.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో పర్యటించిన అంబటి రాయుడు.. ప్రజల నాడి తెలుసుకునేందుకు తాను గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలు, అవసరాలను తెలుసుకుంటున్నానని.. అన్నింటిపై ఓ అవగాహనకు వచ్చిన తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని తెల్చేశారు.

Advertisement

గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పటి నుంచి అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం పరిపాలనను పొగుడుతూ అంబటి చేసిన కామెంట్స్, ట్వీట్లు ఈ ప్రచారానికి బలాన్నిచ్చాయి.వచ్చే ఎన్నికల్లో కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం బలంగా సాగుతోంది.

అంబటి రాయుడు త్వరలోనే అధికారికంగా వైసీపీ కండుకా కప్పుకునే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు లేదా మచిలీపట్నం ఎంపీగా బరిలో ఉంటారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అంబటి రాయుడిని తమ పార్టీలో చేరాలని అటు టీడీపీతోపాటు.. జాతీయ పార్టీ బీజేపీ కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కొందరు.. అంబటి రాయుడిని కలిసి తమ పార్టీల్లో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం.

Related News

DSC జూడో సర్టిఫికెట్ల వివాదంపై.. క్లారిటీ ఇచ్చిన ఎండీ భరణి!

కొత్త పార్టీపై క్లారిటీ, నేను సీఎం అభ్యర్థిని కాను-విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

AP DSC-2025 అక్రమాలపై డొంక కదిలింది.. నిన్న స్పోర్ట్స్, నేడు దివ్యాంగుల కోటా, బయటపెట్టిన బిగ్‌ టీవీ

డబ్బులు ఇవ్వలేదని.. యువకుడ్ని తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన మెకానిక్, భోగాపురంలో ఘటన

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

Big Stories

Advertisement
×