BigTV English

Road Incident in Krishna District: కృష్ణాజిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురు డేడ్!

Road Incident in Krishna District: కృష్ణాజిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురు డేడ్!

Road Accident in Bapulapadu Krishna District: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కోడూరుపాడు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.


ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వేగంగా వచ్చిన కారు.. లారీని ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులంతా తమిళనాడుకి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా కొవ్వూరు నుంచి తమిళనాడుకి వెళ్తున్నారు.

Also Read: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, కారులో ఆ నలుగురు మృతి


మృతి చెందిన వారిలో స్వామినాథన్(40), రాధప్రియ (14), గోపి(23) రాకేష్ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా స్వామినాథన్ భార్య సత్యకు(28) తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Related News

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

Big Stories

×