E-Paper
Advertisement

Road Accident : సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఏడుగురు మృతి..

Road Accident : సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఏడుగురు మృతి..
Advertisement

Road Accident : ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. దర్శి సమీపంలో సాగర్‌ కాల్వలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. 18 మందికి గాయాలయ్యాయి. ఈ బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు.

పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పొదిలికి చెందిన ఓ కుటుంబం వివాహ రిసెప్షన్‌ కోసం కాకినాడ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనలో అబ్దుల్‌ అజీజ్‌(65), ముల్లా జానీబేగం(65), అబ్దుల్‌ హాని(60), ముల్లా నూర్జహాన్‌ (58), షేక్‌ రమీజా (48),షేక్‌ షబీనా(35),షేక్‌ హీనా(6) ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు క్షతగాత్రులను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. మృతురాలు షేక్‌ రమీజా భర్త చెన్నైలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కాకినాడకు రైలులో వెళ్లారు. దీంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Advertisement

ప్రమాదస్థలిని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ పరిశీలించారు. దర్శిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Related News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

Big Stories

Advertisement
×