BigTV English

Sajjala Ramakrishna Reddy: రాష్ట్రానికి ఏం చేశావని ఓటు అడుగుతావు.. చంద్రబాబును ప్రశ్నించిన సజ్జల..

Sajjala Ramakrishna Reddy:  రాష్ట్రానికి ఏం చేశావని ఓటు అడుగుతావు.. చంద్రబాబును ప్రశ్నించిన సజ్జల..
YCP Sajjala Ramakrishna Reddy news

YCP Sajjala Ramakrishna Reddy news(Andhra politics news): ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్‌లు అయినా చేస్తారని మండిపడ్డారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడ్డారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతారని ప్రశ్నించారు. చంద్రబాబు పెట్టే మీటింగుల్లో సీఎం జగన్ ను తిట్టడం తప్పా.. అభివృద్ది గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా అని ప్రశ్నించారు.


తాము నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని ప్రజలను అడుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం జగన్‌ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశాం అని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు.

రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉండాలని అంతిమంగా నిర్ణయించేది ప్రజలేనని సజ్జల అన్నారు. మీడియాలో ఊసుపోని కబుర్లతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. తాము మంచి చేశామని నమ్మితే ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నామన్నారు. చంద్రబాబు సభలు ఎందుకో ఎవరికీ తెలీదని సజ్జల ఎద్దేవా చేశారు.


Read More: సీఎంవో నుంచి కాల్ రావాలి.. ఏపీలో ఎన్నికల్లో పోటీపై అలీ క్లారిటీ..

సిద్ధం సభలకు జనస్పందన చూస్తే సీఎం జగన్‌పై ఉన్న ప్రజాదారణ అర్థమవుతుందని సజ్జల రామకృష్ణ తెలిపారు. ఏం చూసి చంద్రబాబుకు ఓటు వేయాలి? అని ఆయన ప్రశ్నించారు. మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వాస్తవం కాదా? అని అన్నారు. చంద్రబాబు సవాల్‌కు తాము సిద్ధమేనని అన్నారు.

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×