BigTV English

Road Accident : కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

Road Accident : కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

Road Accident : వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన 14 మంది వాహనంలో ఉన్నారు. వారంతా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి తుఫాన్‌ వాహనంలో వెళ్లారు. దర్శనం తర్వాత అదే వాహనంలో స్వగ్రామాలకు తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు.


కడప -తాడిపత్రి ప్రధాన రహదారిలో కొండాపూర్‌ మండలం ఏటూరు గ్రామానికి సమీపంలో తుఫాన్‌ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమాచారం తెలియగానే సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌, ఎస్ఐ సత్యనారాయణ ఘటనాస్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.


Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×