Sobhita Dhulipala:శోభిత దూళిపాళ (Sobhita Dhulipala).. అక్కినేని కొత్త కోడలిగా తనకంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిన్నది. 2022లో నాగచైతన్య(Naga Chaitanya) తో ప్రేమలో పడిన ఈమె.. 2024 నవంబర్లో అన్నపూర్ణ స్టూడియోలో అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు వేసింది. వివాహం అనంతరం ఎక్కువగా భర్తతో కలిసి ఆధ్యాత్మిక మార్గం చేపట్టిన ఈమె తాజాగా అభిమానులకు శుభవార్త తెలిపింది.
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అక్కినేని కోడలు..
వివాహం అనంతరం ఎక్కువగా భర్తతో కలిసి వెకేషన్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. మరొకవైపు గుళ్ళు గోపురాలు అంటూ భక్తిని కూడా చాటుకుంటోంది. ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇప్పుడు అభిమానులతో ఒక గుడ్ న్యూస్ పంచుకుంది. త్వరలోనే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పోస్ట్ చేసింది. తన కొత్త సినిమాకు డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు ఫోటోలు షేర్ చేసిన శోభిత దూళిపాళ మొత్తానికి అయితే పెళ్లి తర్వాత రీఎంట్రీ ఇస్తున్నానని చెప్పి అభిమానులను సంతోషపరిచింది.
అక్కినేని కోడలిపై నెటిజన్స్ ట్రోల్స్..
ఇకపోతే రీ ఎంట్రీ ఇస్తున్నట్లు శోభిత ప్రకటించడంతో పెళ్లయింది. పిల్లలను కనీ ఇంటి బాధ్యత చూసుకోక.. మళ్ళీ ఇప్పుడు సినిమాలు అంటావేంటి? ఇంకెప్పుడు పిల్లల్ని కంటారు అంటూ శోభితపై ట్రోల్స్ చేస్తున్నారు. మరి కొంతమంది నాగచైతన్యకి పిల్లలు అంటే చాలా ఇష్టం.. కనీసం నువ్వైనా నాగచైతన్యకి ఒక ఇద్దరు పిల్లల్ని కనిపెట్టు.. తరువాత నీ కెరియర్ గురించి చూసుకో అంటూ చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం. అక్కినేని అభిమానులు మాత్రం శోభితకు అండగా నిలుస్తున్నారు. పెళ్లయితే సినిమాలు చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? వెంటనే పిల్లల్ని కనాల్సిన అవసరం ఏముంది? ఆమె కూడా తన కెరియర్ లో స్థిరపడిన తర్వాతనే పిల్లల గురించి ఆలోచిస్తుంది అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. అంతేకాదు పలువురు సెలబ్రిటీ పేర్లను కూడా బయటకు తీస్తూ ఉదాహరణతో సహా ఆమెకు అండగా నిలుస్తూ ఉండడం గమనార్హం.
శోభిత ధూళిపాళ కెరియర్..
శోభిత కెరియర్ విషయానికి వస్తే.. తెలుగమ్మాయి ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం కష్టం అనుకునే రోజుల్లో బాలీవుడ్ లో సత్తా చాటింది. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. నటిగా తనను తాను నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె.. కోల్గేట్, రిలయన్స్ ట్రెండ్స్, గోద్రెజ్ వంటి బ్రాండ్లకు మోడల్ గా వ్యవహరించింది.. ఇండియాస్ బెస్ట్ సినీ స్టార్స్ కి ఖోజ్ అనే రియాల్టీ షోలో వైల్డ్ కార్డు పెర్ఫార్మర్ గా కూడా పాల్గొనింది. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ని కూడా సొంతం చేసుకుంది. తర్వాత నటిగా ఫుల్ బిజీ అయిన ఈమె ‘రామన్ రాఘవ్ 2.0’ అనే చిత్రంతో అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి మంచి ఇమేజ్ దక్కించుకున్న ఈమె.. నాగ చైతన్యతో ప్రేమాయణం తర్వాత వార్తల్లో నిలిచింది.
also read:Sandeep Reddy Vanga: గొప్ప మనసు చాటుకున్న సందీప్.. సీఎం సహాయనిధికి భారీ నజరానా?