PM Modi Praises Para Athelets: పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు రికార్డు స్థాయిలో పతకాలు సాధించడంతో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికి 24 పతకాలతో మనవాళ్లు దూసుకుపోతున్నారు. టోక్యో పారాలింపిక్స్ లో 19 పతకాలు మాత్రమే సాధించిన భారత్.. నేడు దానిని దాటేసింది. ఈ శుభ సమయంలో ప్రధాని మోదీ పారిస్ లో ఉన్న భారత అథ్లెట్లతో మనసు విప్పి మాట్లాడారు. వారిని అభినందించారు.
నిజానికి ప్రధాని మోదీ ఇండియాలో లేరు. బ్రూనై పర్యటనలో ఉన్నారు. అది ముగించుకుని సింగపూర్ బయలుదేరారు. ఈ మధ్య సమయంలో పారిస్ లోని అథ్లెట్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. పతకాలు సాధించిన దీప్తి జీవాంజి, మరియప్పన్ తంగవేలు, శరద్ కుమార్, సుందర్ సింగ్ గుర్జార్, అజిత్ సింగ్ తదితరులతో మాట్లాడి.. మీ ప్రతిభ అద్భుతం, మీరెందరికో స్ఫూర్తిదాయకమని అభినందించారు. ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
Also Read: పారాలింపిక్స్: టార్గెట్ కి దగ్గరలో భారత్
పారిస్ పారాలింపిక్స్ కి ముందు భారత ప్రభుత్వం బడ్జెట్ ను పెంచడం, అత్యున్నత స్థాయిలో శిక్షణ ఇవ్వడం, క్వాలిటీ పరికరాలు, విదేశీ నిపుణులు సూచనలు, కోచ్ ల ఏర్పాటు.. ఇలా అన్నిరకాలుగా శిక్షణ ఇవ్వడంతో అథ్లెట్లు ముందడుగు వేశారని అంటున్నారు.
ప్రస్తుతం 25 పతకాల లక్ష్యంగా భారత అథ్లెట్లు పోరాడుతున్నారు. ఆల్రడీ 20 వచ్చాయి. మరో 5 పతకాలు సాధించడం కష్టం కాదని అంటున్నారు. ఇంకా 4 రోజులు మిగిలి ఉండటంతో మరిన్ని పతకాలు పెరిగే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. బడ్డెట్ కూడా రూ.22 కోట్లున్నది, క్వాలిఫైడ్ కోచింగ్ కోసం రూ.75 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది.
పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు ఇన్ని పతకాలు సాధిస్తున్నారంటే అందులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పాత్ర ప్రత్యేకంగా ఉందని అంటున్నారు. వాళ్లెంతో కష్టపడి, వైకల్యం ఉన్నవారిని ఒక చోట చేర్చి, వారి మనసు వికలం కాకుండా చూసుకుంటూ, వారు గాయాల పాలు కాకుండా చూసుకుంటూ, వారిమీద ఒత్తిడి పడకుండా, ఎంతో సున్నితంగా, మరెంతో జాగ్రత్తగా తర్ఫీదిచ్చిన తీరు అద్భుతమని కొనియాడుతున్నారు.
India is proud and delighted!
Our incredible Paralympic contingent has set a record for the highest ever medals for our country in any Paralympics. This shows the dedication, passion and determination of our athletes. Congrats to each and every player. #Cheer4Bharat
— Narendra Modi (@narendramodi) September 4, 2024