Sandeep Reddy Vanga:సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు. తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy Vanga) తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తమ నిర్మాణ సంస్థ భద్రకాళీ ప్రొడక్షన్స్ తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. వారి ఉదారతను ముఖ్యమంత్రి అభినందించి, వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సందీప్ రెడ్డివంగా మంచి మనసుకు అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
సందీప్ రెడ్డివంగా సినిమాలు..
సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్(Spirit ) సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ప్రభాస్ (Prabhas ) మిగతా సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండడం వల్ల స్పిరిట్ సినిమా షూటింగ్ వాయిదా పడుతోంది. సెప్టెంబర్ రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని గతంలో ప్రకటించారు. అది జరగలేదు. ఆ తర్వాత అక్టోబర్లో ఉంటుందన్నారు. అది కూడా జరిగే ప్రసక్తి లేదని సమాచారం. ఇక ప్రస్తుతం డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది. ఇందులో దీపికా పదుకొనేను మొదట హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను సినిమా నుండి తప్పించి.. త్రిప్తి డిమ్రి ను రంగంలోకి దింపారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.
సందీప్ రెడ్డివంగా కెరియర్..
తెలుగు సినిమా రచయితగా, దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో 1988 డిసెంబర్ 25న జన్మించారు 8వ తరగతి వరకు వరంగల్ లోని ప్లాటినం జూబ్లీ హై స్కూల్, అఘాఖాన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్లో చదివిన సందీప్.. 12వ తరగతి వరకు హైదరాబాదులో చదివాడు. ఇక వైద్య కళాశాలలో ఫిజియోథెరపీ పూర్తి చేసి.. కొన్నాళ్ళు వైజాగ్లో ఉద్యోగం కూడా చేశారు. కానీ సినీ రంగంపై ఇష్టంతో ఆస్ట్రేలియా, సిడ్నీలో అకాడమీ ఆఫ్ ఫిలిం థియేటర్ అండ్ టెలివిజన్ లో ఫిలిం మేకింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నారు..
సహాయ దర్శకుడిగా కెరియర్ ఆరంభం..
ఇక 2010 నుండి సినిమా రంగంలోని వివిధ విభాగాలలో పనిచేసిన సందీప్ రెడ్డివంగా.. కేడి సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసి కెరియర్ మొదలు పెట్టాడు. 2015లో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన సందీప్.. అర్జున్ రెడ్డి సినిమా చేసి ఓవర్ నైట్ లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో సంచలనం సృష్టించారు.
ALSO READ:Hero Vishal: ఘనంగా సాయి ధన్సికతో హీరో విశాల్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!
సీఎం సహాయనిధికి సందీప్ రెడ్డి వంగా రూ. 10 లక్షల విరాళం
(భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని అందజేసిన సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా)@revanth_anumula @imvangasandeep #cmrevanthreddy #sandheepreddyvanga #CMReliefFund #PranayReddyVanga… pic.twitter.com/fRdLaAanXO
— BIG TV Cinema (@BigtvCinema) August 29, 2025