Akkineni Nagarjuna: రీసెంట్ టైమ్స్ లో సినిమా హీరోల బర్తడే లకు పాత హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రెండ్ అప్పట్లో పీక్ కి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు కొన్ని రీ రిలీజ్ సినిమాలకి కూడా ఆదరణ తగ్గుతూ వస్తుంది.
ఏదో సూపర్ హిట్ సినిమా విడుదల అయితే గాని ప్రేక్షకుడు థియేటర్ కు రావడానికి ఇష్టపడడం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాకు సరైన రెస్పాన్స్ లేకుండా పోయింది. నేడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రగడ సినిమాకి కూడా రెస్పాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు,జల్సా సినిమాలు మళ్లీ రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. వాటికి కూడా రెస్పాన్స్ అంతంత మాత్రమే ఉంది.
కనీసం అప్డేట్ కూడా లేదు
అక్కినేని ఫ్యామిలీలో ప్రస్తుతం దాదాపు ఐదుగురు హీరోలు ఉన్నారు. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్, సుమంత్, సుశాంత్ అయితే సుమంత్ సుశాంత్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేయడం లేదు. అక్కినేని నాగార్జున,అఖిల్, నాగచైతన్య మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మంచి అప్డేట్ వస్తుంది అని అందరూ ఊహించారు. కానీ ఈ మూడు సినిమాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. అయితే ఇది ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరుస్తుంది.
రావాల్సిన అప్డేట్స్…
అయితే ఈరోజు చాలామంది అభిమానులు చాలా అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కింగ్ నాగార్జున చేయబోయే 100వ సినిమా అప్డేట్ గ్యారంటీగా వస్తుంది అని ఊహించారు. కానీ ఆ సినిమా అప్డేట్ రాలేదు. అఖిల్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నటిస్తున్న లెనిన్ సినిమా నుంచి కూడా ఒక అప్డేట్ రాలేదు. కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య తన 22వ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా అప్డేట్ కూడా రాలేదు. మొత్తానికి మూడిట్లో ఏదో ఒకటైన అప్డేట్ ఇచ్చినా కూడా ఫాన్స్ ఈరోజు సంతృప్తిగా ఉండేవాళ్ళు. ఇక అక్కినేని ఫ్యామిలీలో ఎవరైనా ఈ విషయం మీద స్పందిస్తారేమో వేచి చూడాలి. ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య, అక్కినేని అఖిల్ వీరిద్దరూ చేస్తున్న ప్రాజెక్టుల పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో పరిచయం కాబోతున్నాడు నాగచైతన్య. ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడు అనేది చాలామందికి ఉన్న క్యూరియాసిటీ.
Also Read: Mowgli Glimpse : మోగ్లీ బంగారు ప్రేమ కథ… సుమ కొడుకు బానే కష్టపడ్డాడు