Roja: తప్పు చేస్తే అప్పటికి మాత్రమే.. కొద్దిరోజుల తర్వాతైనా బయటపడుతుంది. మాజీ మంత్రి రోజా విషయంలో అలాంటిదే జరిగింది. ఈమె గుట్టుని బట్టబయలు చేసింది టీడీపీ. ఇంతకీ మాజీ మంత్రి చేసిన తప్పేంటి? ఈ విషయంలో పార్టీ అధినేత జగన్ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
వైసీపీ పాలన గురించి చెప్పనక్కర్లేదు. ఏ శాఖ పట్టుకున్నా అవినీతి కంపు కొడుతోందని కూటమి నేతలు పదేపదే చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది ఆ పార్టీలోని చాలామంది నేతల మెడకు కేసుల ఉచ్చు బిగుస్తోంది. అందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి. రేపో మాపో మాజీ మంత్రి రోజా కూడా బుక్కవ్వడం ఖాయమనే వాదన లేకపోలేదు.
అన్నట్లు రెండువారాల కిందట మాజీ సీఎం జగన్ మీడియా ముందుకొచ్చారు. ఏపీలో దొంగ ఓట్ల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎందుకు నోరు మెదపలేదంటూ ప్రశ్నించారు. అందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, ఇన్‌ఛార్జ్ మాణిక్యాం ఠాగూర్ గట్టిగా కౌంటరిచ్చారు. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం.
మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా ఆగడాలను బయటపెట్టింది టీడీపీ. నగరి మున్సిపాలిటీ ఆరో వార్టు వైసీపీ కౌన్సిలరుగా ఐశ్వర్య ఏకగ్రీవమైంది. వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు జరిగాయి. అందులో కనిపిస్తున్న మహిళ కూడా ఉంది. దొంగ పేరుతో తమిళనాడు నుంచి ఏపీకి దిగుమతి అయ్యిందట ఆమె.
ALSO READ: విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్
రోజా పక్కన సర్కిల్‌లో కనిపిస్తున్న ఆమె పేరు ఐశ్వర్య. తమిళనాడులో ఉంటున్న ఆమెకు అదే పేరుతో తమిళనాడులో ఓటర్ కార్డు ఉంది. నగరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆమెని సాయి సంధ్యారాణి పేరు మార్చేసింది వైసీపీ. ఫేక్ ఓటర్ కార్డు సృష్టించిన వైసీపీ, ఆమెని ఏకంగా నగిరి కౌన్సిలరుగా ఏకగ్రీవం చేశారు ఆనాటి మంత్రి రోజా.
ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో బయటపెట్టింది టీడీపీ. ఇది కేవలం టీడీపీ బయటకు తీసుకొచ్చిన విషయం మాత్రమే. తెలీకుండా ఇలాంటికి ఇంకా ఎన్ని ఉన్నాయోనంటూ చర్చించుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. దొంగ ఓట్ల గురించి మనకు మాట్లాడే అర్హత లేదని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు.
అందుకోసమే నకిలీ ఓట్లపై కనీసం అధినేత జగన్ నోరెత్తలేదని అంటున్నారు. ఆయన నోరెత్తితే ఇలాంటివి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. మొత్తానికి రోజా అడ్డంగా దొరికిపోయిందనే చెప్పాలి. మరి టీడీపీ బయటపెట్టిన ఆ ఫోటోలు, డీటేల్స్‌పై రోజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఒక్కొక్కటిగా బయట పడుతున్న వైసీపీ దొంగ వేషాలు…
తమిళనాడు నుంచి దొంగ ఓట్లు, దొంగ క్యాండిడేట్ల దిగుమతినగరి మున్సిపాలిటీ 6వ వార్టు వైసీపీ కౌన్సిలరుని దొంగ పేరుతో తమిళనాడు నుంచి దిగుమతి చేసింది వైసీపీ.. "ఐశ్వర్య" పేరుతో తమిళనాడులో నివసిస్తున్న మహిళకు అదే పేరుతో తమిళనాడులో ఓట… pic.twitter.com/uA9gJd1HGX
— Telugu Desam Party (@JaiTDP) August 28, 2025